Lakshmi Reddy Arrest: తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మీ రెడ్డిని చీటింగ్ కేసులో జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతుంది. తిరుపతి మొదటి అదనపు సివిల్ కోర్టు ఆదేశాలతో జైపూర్ కు లక్ష్మీని తీసుకెళ్ళడానికి సిద్దమైన పోలీసులు..
AP Liquor Rates Hike: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలను ప్రభుత్వం సవరించింది. ఈ సందర్భంగా, 15 శాతం లిక్కర్ ధర పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Bird Flu: తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. గోదావరి జిల్లాల్లో వైరస్ తో చనిపోతున్న కోళ్లకు బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయ్యింది. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో తీసుకున్న శాంపిల్స్ పాజిటివ్ గా వచ్చింది.
Minister Anam: శ్రీశైలంలో మహా శివరాత్రి ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష ముగిసింది. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.. ఈనెల 25, 26 రెండు రోజులు శ్రీశైలం టోల్ గేట్లు ఉచితం చేస్తాం..
Purandeswari: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి లేఖ రాశారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో ఎర్ర కాలువ పునరుద్ధరణకు 268.5 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. నల్లజెర్ల, దేవరపల్లి మధ్య 6 కిలోమీటర్ల నిడివిలో కుడి, ఎడమ గట్టుల శాశ్వత పునరుద్ధరణకు రూ. 72 కోట్లు ఇవ్వాలన్నారు.
గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై విచారణల్లో దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సమాచారం ఇవ్వాలి అని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. కాగా, బ్యాంకులు ఈ విచారణలకి తగిన సహకారాన్ని అందించాలని పేర్కొన్నారు.
Speaker Ayyanna Patrudu: ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
CPI Ramakrishna: రాయలసీమ సాగు నీటి సాధనా సమితి ఆధ్వర్యంలో ఏపీలో ప్రాజెక్టుల నిర్మాణంపై సమావేశం. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాద్రి రావు, ఇరిగేషన్ నిపుణులు లక్ష్మీనారాయణతో పాటు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. గాలేరి, హంద్రీనీవా వంటి పలు ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేయాలి అన్నారు.
Tirumala Laddu Case: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో మరి కొందరి ప్రమేయంపై సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం ఆరా తీస్తుంది. గత రాత్రి అరెస్టు చేసిన నలుగురు నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది.
Andhra Pradesh: జనసేన నేత కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేసిన లక్ష్మీ రెడ్డిని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ దగ్గర ఆమెను అదుపులోకి తీసుకొని యూనివర్సిటీ పోలీసు స్టేషన్ కి తరలించారు.