రేపటి నుంచి(ఫిబ్రవరి 24) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై ఉన్న నిబంధనల్ని కట్టుదిట్టంగా అమలు చేయలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, విజిటర్లు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాస్ లు జారీ చేశారు. భద్రతా కారణాల రీత్యా పాస్ లు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. అసెంబ్లీ, మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్ లతో పాస్ లను జారీ చేశారు. అసెంబ్లీ గేట్ 1 నుంచి మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంలకు మాత్రమే అనుమతి కల్పించనున్నారు.
Also Read:IND vs PAK: ఓడీఐలో అత్యధిక క్యాచ్‌లు.. విరాట్ కోహ్లీపై సరికొత్త రికార్డు…
గేట్ 2 నుంచి మంత్రులకు మాత్రమే అనుమతి ఉంది. గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతి ఉంటుంది. మండలి చైర్మన్, స్పీకర్, సీఎంలు వచ్చి వెళ్లే కారిడార్ లోకి ఇతరులెవ్వరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు. నాలుగో గేట్ గన్ పాయింట్ మినహా భద్రతా సిబ్బందిని అనుమతించేది లేదని వెల్లడించారు. మంత్రులు, సభ్యుల పీఏలను అవసరం మేరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. శాసనసభా వ్యవహారాలతో సంబంధం లేని ప్రభుత్వ విభాగాల సిబ్బందికి ప్రాంగణంలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు.
Also Read:Jio Bharat K1 Karbonn 4G: క్రేజీ డీల్.. రూ. 699కే జియో 4G ఫోన్
శాసనసభ, మండలిలోకి సభ్యులు ఎవరూ ఆయుధాలతో రాకూడదని స్పష్టం చేశారు. ఒక వేళ ఆయుధాలతో వచ్చినా అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న బెల్ ఆఫ్ ఆర్మ్ లో డిపాజిట్ చేయాల్సిందిగా సూచించారు. ఆయుధాలు, లాఠీలు, ప్లకార్డులు, విజిల్స్ లాంటి వాటితో ప్రాంగణంలోకి ప్రవేశం లేదని తెలిపారు. భద్రతా కారణాల రీత్యా సభ్యుల పీఏలు, వ్యక్తిగత సిబ్బందిని తీసుకురావొద్దని స్పష్టం చేశారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ మినహా ఇతర చోట్ల మీడియా సమావేశాలు నిర్వహించొద్దని సభ్యులకు, మంత్రులకు సూచనలు జారీ చేశారు.