మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ నాయకులు గ్రామాల్లోకి, ఇంటింటికీ వెళ్లే పరిస్థితులు లేవని.. హామీలు నిలబెట్టుకోకపోతే చొక్కాలు పట్టుకోవాలని వాళ్లే అన్నారు.. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్నారు.. ఇప్పుడు బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ అయ్యిందని ఆరోపించారు..
మెగాస్టార్ చిరంజీవి వారసుడు కావాలన్న వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల.. వారసుడు కొడుకే అవుతాడా..? కూతుర్లు కారా? అని ప్రశ్నించారు.. మెగాస్టార్ చిరంజీవి ఏ ఉద్దేశ్యంతో అన్నారో తనకు తెలియదన్నారు.
నా మీద విష ప్రచారం చేయడానికి వైసీపీ సోషల్ మీడియా వంద కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు కిరణ్ రాయల్.. రాష్ట్రం మొత్తం నన్ను తప్పుగా చూపిస్తూ.. పార్టీని డ్యామెజ్ చేయాలని కుట్ర పన్నారు.. ఎన్నికల ముందు లక్ష్మీతో అభినయ్ రెడ్డి ఒప్పందం కూర్చుకున్నాడు.. కిరణ్ రాయల్ కు తిరుపతి సీటు వస్తే.. అప్పుడు ఇలాంటి ప్రచారం చేయాలి.. పది కోట్లు ఇస్తామని లక్ష్మీతో అగ్రిమెంట్ చేసుకున్నాడు అభినయ్ రెడ్డి అని విమర్శించారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో.. అనుమలంకలో ఇప్పటికే 13 వేలకు పైగా కోళ్లు మృతి చెందటంతో కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కోళ్ల ఫారాల్లో తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా.. జిల్లా వ్యాప్తంగా పౌల్ట్రీ ఫామ్‌లలో తనిఖీలు నిర్వహించి బర్డ్ ఫ్లూ పరిస్థితులను అంచనా వేయాలని పేర్కొన్నారు..
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో సమావేశం సమావేశమయ్యారు వైసీపీ అధినేత జగన్.. సమావేశానికి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని, మేరుగు నాగార్జున, వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటన ప్రారంభమైంది.. హైదరాబాద్ నుంచి బయల్దేరిన పవన్ కల్యాణ్.. కొచ్చి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి ఈ రోజు శ్రీకారం చుట్టిన ఆయన.. ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఈ పర్యటనలో మొదట దర్శించుకోనున్నారు పవన్ కల్యాణ్..
గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం.. విచారణ తప్పదని హెచ్చరిస్తోన్న విషయం విదితమే.. అయితే, వైసీపీ హయాంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పేదలకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు, హౌసింగ్ నిర్మాణాలకు అనుమతులు పొందిన లబ్ధిదారుల్లో అర్హులు, అనర్హులు విషయంలో లెక్కలు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ మద్యం అమ్ముతున్న వ్యక్తులను పోలీసుల అరెస్టు చేశారు. మధ్యాహ్నం హోమ్ డెలివరీ చేస్తూ వ్యాపారం సాగిస్తున్న వ్యక్తులపై ఇటీవల సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ గా మారాయి.
కోళ్లపై వైరస్ పంజా విసురుతోంది.. దీంతో, వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.. ఆంధప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది.. దీంతో పౌల్ట్రీ ఫామ్ నుండి కిలో మీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్‌గా ప్రకటించారు.. ఇన్ఫెక్షన్ జోన్‌లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.. 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్‌గా…