Pawan Kalyan: అపోలో ఆస్పత్రికి పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎంకు వైద్య పరీక్షలు..
- అపోలో ఆస్పత్రికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- పవన్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు..
- స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించిన వైద్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు.. ఈ రోజు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు పవన్ కల్యాణ్.. ఆయనకు స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు.. పవన్‌కు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరమని వైద్యులు సూచించగా.. ఈ నెలాఖరునగానీ లేదా మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకోనున్నారట పవన్ కల్యాణ్.. ఇక, ఈ నెల 24వ తేదీ నుంచి మొదలయ్యే ఏపీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నారు పవన్ కల్యాణ్.. శ్రీ పవన్ కల్యాణ్ గారు హాజరవుతారు.
Read Also: Off The Record: ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీకి ఎందుకు ప్రత్యేకం..?
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
మరోవైపు.. రేపు సాయంత్రం 5 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం జరగనుంది.. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీకానున్నారు పవన్ కల్యాణ్.. ఏపీ బడ్జెట్ పై అవగాహన కల్పించడంతో పాటు.. అసెంబ్లీ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలి, బడ్జెట్ పై ఎలా చర్చించాలి అనే అంశాలపై పార్టీ ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేయనున్నారు పవన్ కల్యాణ్.. కాగా, పవన్ కల్యాణ్, గత కొంతకాలంగా బ్యాక్‌పెయిన్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారు.. ఆ మధ్య కేబినెట్ సమావేశానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు.. ఇక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకున్న సమయంలోనూ.. ఆయన ఆయుర్వేద వైద్యుల సలహాలు తీసుకున్నట్టుగా.. కొన్ని మూలికలు కూడా తీసుకున్నట్టుగా ఆయన అనుచరులు పేర్కొన్న విషయం విదితమే.. అంతేకాదు, తాజాగా ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో వెన్ను నొప్పి కారణంగానే ఏపీలో కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయానని.. ఇప్పటికీ వెన్న నొప్పి నన్ను తీవ్రంగా బాధిస్తోందని పవన్ కల్యాణ్ స్వయంగా వెల్లడించారు.. కాగా, తాజాగా పవన్ కల్యాణ్ అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలను చేసుకున్న విషయాన్ని ఫొటోలతో సహా వెల్లడించింది జనసేన పార్టీ..
అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న శ్రీ @PawanKalyan గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు ఈ రోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని… pic.twitter.com/TjeWc4T0WZ— JanaSena Party (@JanaSenaParty) February 22, 2025
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!