ఇవాళ్టి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.. హైందవ ధర్మ పరిరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్న పవన్. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు.
CM Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు చెప్పారు. త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు.
రేపు (ఫిబ్రవరి 12) ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ కు బయలుదేరి వెళ్లనున్నారు. రేపటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆయన జ్వరం నుంచి కోలుకుంటుండగానే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయింది.
Minister Kollu Ravindra: ఏపీలో లిక్కర్ ధరల పెంపకంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఎకైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3 వేల షాపులకు 90 వేల దరఖాస్తులు వచ్చాయి.. చాలా పారదర్శకంగా మద్యం దుకాణాల అలాట్మెంట్ జరిగింది.. గతంలో పనికి రాని చెత్త బ్రాండ్లు ఉండేవి అన్నారు.
Bird Flu In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గంపలగూడెం మండలంలోని అనుమ్మోలంకలో శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా నాలుగు వేల కోళ్లు మృతి చెందాయి. గడిచిన రెండు రోజుల్లో కలిపి మొత్తంగా 10 వేలకు పగా కోళ్లు మృత్యువాత పడ్డాయి.
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్నీ నిర్ణయాలను ముఖ్య నేతలతో చర్చించి మాజీ సీఎం, వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. గుంటూరు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన పలు పార్టీ అంశాలపై వారు ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు, పోలవరం, హామీల అమలు తీరుపై చర్చ జరిపినట్లు తెలుస్తుంది.
MP Midhun Reddy: పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలు లేవనేత్తామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు.. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావడానికి రూ. 60 వేల కోట్లు ఖర్చు అవుతాయని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పోలవరం కి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
YV Subba Reddy: బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఉభయ సభల్లో రాష్టానికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రస్తావించాలని దృష్టి సారించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు.
Kakani Govardhan Reddy: ఎన్నికలలో ఇచ్చిన హామీలకు చంద్రబాబు తిలోదకాలు ఇస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పి.. బాటిల్ చూపించి పదే పదే చూపించారు.