Group 2 Candidates Protest: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్షపై ఉత్కంఠ నెలకొంది.. అసలు పరీక్ష ఉంటుందా? లేదా? అనే అయోమయంతో గందరగోళంలో ఉన్నారు గ్రూప్-2 అభ్యర్థులు.. అయితే, షెడ్యూల్ ప్రకారం రేపు గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగనుంది.. రోస్టర్ సమస్య పరిష్కరించేవరకు ఏపీపీఎస్సీకి లేఖ రాసింది ఏపీ ప్రభుత్వం.. కానీ, సర్కార్ లేఖపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా స్పందించలేదు.. మరోవైపు, గ్రూప్-2 పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. ఇక, పరీక్షలు యథావిధిగా జరుగుతాయని.. కొన్ని జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు.. దీంతో, గ్రూప్ -2 అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.. విశాఖపట్నంలో తమ పోరును ఉధృతం చేశారు గ్రూప్-2 అభ్యర్థులు.. ఇసుక తోట జంక్షన్ లో జాతీయ రహదారిని దిగ్భందించి నిరసనకు దిగారు.. దాంతో, భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో.. గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన అడ్డుకునేందుకు పోలీసులులు ప్రయత్నించారు.. దీంతో, పోలీసులకు అభ్యర్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.. ఎగ్జామ్ బాయ్ కాట్ చేయాలి అంటూ నిరసనలు కొనసాగిస్తున్నారు గ్రూప్-2 అభ్యర్థులు..