Vizag: విశాఖపట్నంలో మందుల కోసం వచ్చి మెడికల్ షాప్ దగ్గరే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు విజయనగరం జిల్లా బుదరాయవలసకు చెందిన రమణ (60)గా గుర్తింపు.
Nandamuri Balakrishna: కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించిన సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణతో కొమరవోలు గ్రామస్తులు ఫోటోలు దిగుతుండగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kaleswaram Commission: నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ తిరిగి ప్రారంభం కానుంది. గతంలో కమిషన్ ఎదుట హాజరైన వ్యక్తుల్లో కొందరిని మళ్లీ విచారణ చేయాలని నిర్ణయించింది. ఈ విచారణలో ముఖ్యంగా అనుమతులు, నిర్మాణ పనుల్లో కీలకంగా వ్యవహరించిన ఇంజినీర్లను ప్రశ్నించనుంది. కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లు, విచారణలో చెప్పిన అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు కమిషన్ భావిస్తోంది. అందువల్ల, నిజమైన అంశాలను వెలికితీయడానికి ఈ దర్యాప్తును మరింతగా క్షుణ్ణంగా నిర్వహించనున్నట్లు సమాచారం. Read Also: Telugu Language:…
ఆంధ్రప్రదేశ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశృతి జరిగింది. తమ్మిలేరు వాగులో స్నానాలకు దిగి ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. ఈ ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు గల్లంతయ్యాడు.
మేము కూటమిగా కలిసే ఉంటాం.. విడిపోయే ప్రసక్తే లేదు.. ఎందుకు పవన్ ఈ మాట పదే పదే చెబుతున్నారు. దీని వెనక ఉద్దేశం ఏంటి..? కొన్ని అంశాల్లో వచ్చిన విభేదాల వల్ల ఈ మాట చెబుతున్నారా.. లేక వైసీపీ బలపడకూడదు అనే ఉద్దేశం ఉందా..? కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతోంది. కూటమి ఏర్పాటులో పవన్ పాత్ర చాలా కీలకం.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు విచారణ ముగిసింది. అనంతరం.. వైద్య పరీక్షలు నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు పోలీసులు. వంశీని మూడు గంటలకు పైగా విచారించారు.
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలో అనంతపురం గంగమ్మ తల్లిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా.. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి అమ్మ వార్లకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. ఇందిరమ్మ దంపతులు దర్శించుకున్నారు.. యాగంటి ఆలయ క్షేత్రానికి చేరుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి - ఇందిరమ్మ దంపతులకు ఆలయం మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు,
నేను అన్ని ఆధారాలతో మాట్లాడుతుంటే... బెదిరిస్తున్నారని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి.. శాసనమండలిలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తుంటే అధికార పార్టీ సభ్యులు తట్టుకోలేకపోతున్నారన్న ఆయన.. ఆధారాలతో సహా మాట్లాడుతుంటే.. బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు..