Off The Record: తణుకు మద్యం వ్యాపారాలు ఘొల్లుమంటున్నారా..?
- తణుకు మద్యం వ్యాపారులు ఘొల్లుమంటున్నారా?..
- లాభం తర్వాత.. నష్టం రాకుండా చూసుకోవడమే టాస్క్ అయిందా?..
- గవర్నమెంట్ ఫీజుకంటే పొలిటికల్ సమర్పణలు పెరిగిపోయాయా?..
- ఎమ్మెల్యే అరిమిల్లి పేరు చెప్పి ఛోటా లీడర్స్ చెలరేగుతున్నారా?..
- భారీ ముడుపులతో వైన్స్ యజమానులు ఉక్కిరి బిక్కిరి?..
- లాటరీలో లోకల్ మద్యం సిండికేట్‌కు నిరాశ..
- రాజకీయ అండతో.. షాపులు దక్కించుకున్న వాళ్ళని దోచేస్తున్నారా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆ నియోజకవర్గంలో వైన్స్ వ్యాపారులు వణికిపోతున్నారా? లాటరీలో షాపులు దక్కాయ్…. మనమంతా లక్కీ భాస్కర్స్ అని మురిసిపోయిన వాళ్ళకు ఇప్పుడు తత్వం బోధపడుతోందా? ఎందుకొచ్చిన యాపారంరా… నాయనా.. ఇది అంటూ ఎవరో ఒకరికి ఇచ్చేసి సైలెంట్‌గా సైడై పోదామని అనుకుంటున్నారా? మద్యం వ్యాపారుల ఫ్రస్ట్రేషన్‌కు కారణం ఏంటి? వాళ్ళ లాభాలను అంతలా దోచేస్తున్నదెవరు?.. దేవుడు కరుణించినా.. పూజారి వరం ఇవ్వనట్టుగా తయారైందట తణుకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైన్ షాపుల నిర్వహుకుల పరిస్థితి. అదేంటయ్యా…. వైన్స్ అంటే….. యమా రంజుగా ఉంటుంది కదా… వ్యాపారం. పాపం వాళ్ళకంత కష్టం ఏమొచ్చిందని అంటే…. అంతా రాజకీయ మహిమ అన్నది లోకల్ టాక్. అక్రమాలు, అడ్డగోలు దందాల సంగతి తర్వాత…. కనీసం నిబంధనల ప్రకారం యాపారం చేసుకుందామన్నా… ఇక్కడి నాయకులు చేయనిచ్చేట్టు లేరంటూ ఘొల్లుమంటున్నారట వైన్ షాపుల యజమానులు.
Read Also: Off The Record: కోనప్ప, ఐకే రెడ్డి ఏం చేయాలనుకుంటున్నారు?
Also Read
- OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
- Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
- OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
- OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
ఇక, తణుకులో లిక్కర్ బిజినెస్ చేస్తే లాభాల సంగతి తర్వాత… నష్టాలు రాకుండా చూసుకోవడమే పెద్ద టాస్క్ అన్నది ఇక్కడి వ్యాపారుల మనోగతంగా తెలుస్తోంది. లక్షలు పోసి లైసెన్స్ తెచ్చుకున్నా.. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే పర్సంటేజ్ వర్కౌట్ అవటంలేదని ఒకవైపు బాధపడుతున్నామని, అదిపోను… ఇప్పుడు గవర్నమెంట్ కి కట్టిన ఫీజు కంటే లోకల్ లీడర్స్‌కి సమర్పించుకోవాల్సిన చలానాలు ఎక్కువ అవుతున్నాయని భోరుమంటున్నారట వ్యాపారులు. లాటరీకి ముందు వ్యాపారం చేసేందుకు ఉత్సాహం చూపించిన నిర్వాహకులు.. వైన్ షాపులు దక్కిన తర్వాత మాత్రం మత్తు ఎక్కకుండానే గుడ్లు తేలేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. లోకల్ లీడర్స్ పర్సంటేజీల డిమాండ్స్ ఎక్కువైపోవడంతో…. లైసెన్స్ ఉన్నా మద్యం అమ్మకాలు చేయాలంటే హడలిపోయే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పేరు చెప్పుకుని కొంతమంది ఆయన అనుచరులు, ఇతర ఛోటా లీడర్స్ ఎక్కడికక్కడ వైన్స్ షాపుల మీదపడి మందు మీది కిక్కు మాది అన్నట్టు వ్యవహరించడం నిర్వాహకులకు తలనొప్పిగా మారిందట.
Read Also: Off The Record: మింగలేక-కక్కలేక అన్నట్టుగా ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితి?
అలాగే, నియోజకవర్గంలో ఎక్కడ షాపు పెట్టాలన్నా.. పెట్టిన షాపులు సవ్యంగా నడవాలన్నా స్థానిక నాయకులకు భారీగా ముడుపులు చెల్లించుకోవాల్సి వస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి భారీ మామూళ్ల కారణంగా నెల తిరిగేసరికి చేతిలో ఏం మిగలక వైన్స్ నిర్వాహకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. జిల్లావ్యాప్తంగా వైన్ షాపులు దక్కించుకునేందుకు సిండికేట్ గా ఏర్పడిన కొందరు 300 కి పైగా అప్లికేషన్లు దాఖలు చేశారట.. తీరా లాటరీ తీశాక సిండికేట్ మెంబర్లకు పదిలోపే షాపులు దక్కడంతో… వాళ్ళంతా కలిసి రాజకీయ అండతో… షాపులు దక్కించుకున్న వాళ్ళని దోచేయడమే పనిగా పెట్టుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే బార్ ఓనర్లుగా చెప్పుకునే మరి కొంతమంది తమ ప్రాంతాల్లో వైన్ షాప్ లేకుండా చూసుకునే ప్రయత్నం చేయడంతో… సమస్య మరింత పెరిగిందని అంటున్నారు. తణుకు టౌన్‌లోని ఒక ప్రాంతంలో 20 ఏళ్లుగా నడుస్తున్న వైన్ షాపును అక్కడే కొనసాగించాలంటే అడిగినంత ఇవ్వాల్సిందేనని లేదా లైసెన్స్ తమకు అప్పచెప్పాలంటూ సదరు షాపు యజమానికి హుకుం జారీ చేసిందంట MLA అనుచర వర్గంగా చెప్పుకునే గ్యాంగ్. ఎమ్మెల్యేకి అనుచరుడిగా చెప్పుకుంటున్న వ్యక్తికి సంబంధించిన బార్ బిజినెస్ బాగుండాలనే ఉద్దేశంతోనే కొంతమందికి ఎక్సైజ్ అధికారులు సైతం సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో త్వరలోనే సిండికేట్ సభ్యులంతా కలిసి మద్యం రేట్లు పెంచేసి అమ్మాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
Read Also: Hydra : పెండింగ్ లో 10వేల ఫిర్యాదులు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజెంటేషన్
ఇక, వైన్ షాపుల వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే ఎమ్మెల్యే చెప్పుకొచ్చినా ఆయన అనుచర వర్గం మాత్రం మాట వినడం లేదని తెలుస్తోంది. మొదట్లో పావలా వాటా ఇవ్వాలంటూ పట్టు పట్టిన నేతలు కొంతమంది….. ఇప్పుడు షాపుకి ఇంతని ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం మరింత వివాదంగా మారుతోంది. ఎమ్మెల్యే అనుచర వర్గంగా చెప్పుకుంటున్న సిండికేట్ మెంబర్స్ షాపుల నుంచి వసూలు చేసిన మొత్తంలో కొంత ఎక్సైజ్ అధికారులకు మరికొంత.. తమ జేబులోకి వేసుకుంటున్నారా లేక లోకల్ పాలిటిక్స్ కోసం వాడుతున్నారా అంటూ చర్చించుకుంటున్నారట వైన్ షాప్ ఓనర్స్. మొత్తానికి వైన్ షాపులు విషయమై తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారిందని అంటున్నారు. ఇందులో ఎమ్మెల్యేకి ప్రత్యక్షంగా ప్రమేయం ఉందా లేదా అన్న సంగతి పక్కనబెడితే… ఆయన పేరు చెప్పుకుని దండుకునే బ్యాచ్ మాత్రం జోరుగా ఉందట. వాళ్ళని కంట్రోల్ చేయకుంటే తిరిగి తిరిగి అది ఎమ్మెల్యేకే చుట్టుకుంటున్నది అంటున్నారు ఆయన శ్రేయోభిలాషులు. దీనిపై అరిమిల్లి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి మరి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!