Sanju Samson Comeback: అవకాశాల్లేవు, ఛీకొట్టారు, రిటైర్మెంట్ అన్నారు.. కట్ చేస్తే ‘జెనరేషన్ నాక్’తో నోళ్లు మూయించాడు!
- అవకాశాల్లేవు, ఛీకొట్టారు, రిటైర్మెంట్ అన్నారు
- కట్ చేస్తే 'జెనరేషన్ నాక్'తో నోళ్లు మూయించాడు
- సంజు ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson Inspiring Comeback Story: టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకం అనే చెప్పాలి. మెగా టోర్నీ ప్రారంభంలో సంజుకు అవకాశాలు రాలేదు. 48 బంతుల్లో అర్ధశతకం కూడా నమోదు చేయకపోయినా.. తన సామర్థ్యాన్ని నిరూపించుకునే ఛాన్స్ కోసం ఓపికగా ఎదురుచూశాడు. లీగ్ దశలో మూడు మ్యాచ్‌ల పాటు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అదే సమయంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా డకౌట్స్ అయినా.. సంజుకు అవకాశం రాకపోవడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది.
జట్టు మేనేజ్‌మెంట్, ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్ టీమ్ ఎంపికలపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన కొన్ని కామెంట్స్ కూడా సంజు శాంసన్‌పై ఒత్తిడిని పెంచాయి. అయినప్పటికీ అతడు సహనం కోల్పోలేదు. అవకాశం కోసం ఓపికగా ఎదురుచూశాడు. చివరకు ఫినిషర్ రింకు సింగ్ స్థానంలో అవకాశం దక్కింది. సంజు రాకతో ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను మూడో స్థానంలో ఆడించింది. మూడో స్ధానంలో ఆడే తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్‌కు మారాడు. అభిషేక్ శర్మ వరుసగా డకౌట్స్ అవుతుండడంతో అతడిపై ప్రెజర్ తగ్గించేందుకు ధాటిగా ఆడే సంజుని ఓపెనర్‌గా ఆడించారు. ఈ మార్పు సంజు కెరీర్‌కు కీలక మలుపుగా మారింది.
Also Read
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
Also Read: Sanju Samson: 3 పరుగులతో సెంచరీ మిస్, మీరు నిరాశ పడ్డారా?.. సంజు షాకింగ్ ఆన్సర్!
2026 వరల్డ్ కప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన సంజు శాంసన్ ఒక్కసారి కూడా డక్ కాకుండా నిలకడగా రన్స్ చేశాడు. ఓపెనర్‌గా జట్టుకు బలమైన ఆరంభాలు అందించాడు. ముఖ్యంగా సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో చెలరేగి టీమిండియాకు విజయాన్ని అందించాడు. 50 బంతుల్లో 97 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. సంజు ఇన్నింగ్స్‌ను చాలామంది ‘జెనరేషన్ నాక్’గా అభివర్ణిస్తున్నారు. సంజు ప్రదర్శనతో భారత్ సెమీఫైనల్ చేరింది. సెమీఫైనల్‌లో కూడా సంజు ఆడడం ఖాయం అయింది. ఒకవేళ భారత్ ఫైనల్ చేరినా.. సంజు ఓపెనర్‌గా ఆడుతాడు. కృషి, విశ్వాసం ఉంటే పరిస్థితులు మారుతాయని సంజు ప్రయాణంతో అర్ధమవుతోంది. ఈ వరల్డ్ కప్‌లో ఆలస్యంగా అవకాశం వచ్చినా.. రెండు చేతులా అందిపుచ్చుకుని సక్సెస్ అయ్యాడు.
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!