గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది.. ఇప్పటికే పలు కేసులు ఆయనపై నమోదు కాగా, తాజాగా మరో మూడు కేసులు పెట్టారు పోలీసులు.. వల్లభనేని వంశీ పై మూడు కేసలు నమోదు చేశారు కృష్ణా జిల్లా పోలీసులు.. ఆత్మకూరు, వీరవల్లి పోలీస్ స్టేషన్లతో పాటు మళ్లీ గన్నవరం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి..
వైఎస్ జగన్మోహన్రెడ్డి వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు.. గత రెండు రోజులుగా ఆయన ఫీవర్‌తో బాధపడుతోన్నట్టుగా తెలుస్తుండగా.. అయినా, ఈ రోజు కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొన్నారు మాజీ సీఎం.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మోడ్‌లోకి వెళ్లింది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు... రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ జిల్లాల పరిధిలోని ఉద్యోగులకు ఎన్నికల సంఘం క్యాజువల్ లీవ్‌ను ప్రకటించింది. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది.
మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానాలకు దిగి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. తక్షణమే రంగంలోకి దిగి పోలీసులు, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ప్రారంభించారు. మహాశివరాత్రి సందర్భంగా నదిలో స్నానానికి వెళ్లిన యువకులు.. లోతు ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో మునిగిపోయినట్టుగా భావిస్తున్నారు.
వల్లభనేనిపై మరో ఫిర్యాదు అందింది.. కోనాయి చెరువు రిజర్వాయర్ కు అదనంగా మరో రిజర్వాయర్ నిర్మాణం పేరిట మట్టి తవ్వకాలు చేపట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.. తొండెం గట్టు చెరువులో మట్టి తవ్వకాలు చేసి కోట్లు కొల్లగొట్టినట్టు వంశీ, ఆయన అనుచరులపై గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు మురళీ అనే వ్యక్తి.. దీంతో, వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు..
శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదినం కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు.. సాయంకాలం శ్రీస్వామి అమ్మవార్లకు నందివాహనసేవ, ఆలయ ఉత్సవం నిర్వహించనున్నారు.. రాత్రి 10 గంటలకు లింగోద్బవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీస్వామివారికి పాగలంకరణ ఉండగా.. రాత్రి 12 గంటలకు పార్వతి పరమేశ్వరుల మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండో రోజు పర్యటనలో భాగంగా.. ఈ రోజు ఉదయం 9 గంటలకు పులివెందుల పట్టణంలోని గుంత బజార్ లో ఉన్న వైయస్సార్ పౌండేషన్ మరియు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఆధునికరించిన వైయస్ రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభిస్తారు.. అనంతరం మధ్యాహ్నం 12. 20 గంటలకు పులివెందుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు బయలుదేరి వెళ్లనున్నారు..
ఏపీలో గురువారం మూడు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పోలింగ్‌తో పాటు ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అందుకోసం.. అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.