Hayagreeva Lands: హయగ్రీవ ఫామ్స్ అండ్ విల్లాస్‌కు మరో షాక్..!
- హయగ్రీవ ఫార్మ్ అండ్ విల్లాస్ సంస్థకు షాక్ మీద షాక్..
- సుమారు 500 కోట్ల రూపాయల విలువైన భూములు స్వాధీనం..
- 22ఏ జాబితాలో చేర్చి.. నిషేధిత భూములుగా నోటిఫై..
- రిజిస్ట్రేషన్ పై ఆంక్షలు అమలులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hayagreeva Lands: విశాఖపట్నంలో ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హయగ్రీవ ఫార్మ్ అండ్ విల్లాస్ సంస్థకు షాక్ మీద షాక్ తగులుతోంది. సుమారు 500 కోట్ల రూపాయల విలువైన 12.5 ఎకరాలను స్వాధీనం చేసుకున్న జిల్లా యంత్రాంగం.. వాటిని 22ఏ జాబితాలో చేర్చింది. నిషేధిత భూములుగా నోటిఫై చేయడంతో రిజిస్ట్రేషన్ పై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. అధికారం అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములతో అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హయగ్రీవ ఫార్మ్ అండ్ విల్లాస్ కు విశాఖ జిల్లా యంత్రాంగం చుక్కలు చూపిస్తోంది. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన వ్యాపార భాగస్వాములతో కలిసి వేసిన స్కెచ్ మొదటికే మోసం తెచ్చింది. అక్రమాలపై విచారణలో నిజాలు నిగ్గు తేలడంతో 16 ఏళ్ల తర్వాత కేటాయింపులు రద్దు చేసినట్టు ప్రకటిం చింది.
Read Also: CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. జైశంకర్ తో భేటీ అయ్యే అవకాశం..
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
ఇక, ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఎండాడలోని సుమారు 500కోట్ల రూపాయల విలువైన భూములను స్వాధీనం చేసుకుని కంచేవేసింది రెవెన్యూ యంత్రాంగం. సర్వే నెంబర్ 92/3లోని 12.51 ఎకరాలను 22(A) జాబితాలో చేర్చడం ద్వారా నిషేధిత భూములుగా ప్రకటించింది. దీంతో హయగ్రీవకు సంబంధించిన క్రయవిక్రయాలు., రిజిస్ట్రేషన్ లు పై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు మీద కోట్లాది రూపాయలు పెట్టిన వాళ్లకు దిక్కుతోచని స్థితి. వృద్దులు కోసం విల్లాలు, అనాథలుకు ఆశ్రమం పేరుతో 2008లో ప్రభుత్వం నుంచి చౌక ధరకు భూములు తీసుకుంది హయగ్రీవ. ఎకరా 45 లక్షల చొప్పున కొనుగోలు చేయగా.. అడ్డగోలుగా పార్టనర్లను చేర్చుకోవడం ద్వారా భారీ అవకతవకలకు పాలడినట్టు విచారణలో తేలింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం లక్ష్యంగా చేసిన ఈ భూమంతర్ కారణంగా స్థిరాస్తి విలువ 40శాతం పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. గ్రూపు డెవలప్‌మెంట్ స్కీమ్ కింద 61 మందితో చేసుకున్న ఒప్పందాల మేరకు విల్లాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ తరుణంలో హయగ్రీవ భూ కేటాయింపులు రద్దయ్యాయి. నిషేధిత జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. 22(ఏ) కారణంగా ఎటువంటి క్రయవిక్రయాలు అవకాశం లేదు. నిబంధనలు ఉల్లంఘించడం, స్వార్థంగా వ్యవహరించడం వల్లనే భూమిని వెనక్కి తీసుకున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
12.51 ఎకరాల భూమిలో 10 శాతం భూమి ఉపయోగించి వృద్ధులు, అనాథలు, దివ్యాంగులకు ఆశ్రమం నిర్మిస్తామని, ఉచితంగా నిర్వహిస్తామని ఒప్పందం చేశారు. పదిహేనేళ్లు అయినా దానిని పూర్తి చేయలేదు. కానీ ఈ హామీని కూడా అమలు చేయకపోవడం వల్ల భూమిని రద్దు చేశారు.
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!