* మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో నేడు కీలక పోరు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్న గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ప్రారంభం
* అమరావతి : ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న శాసనమండలి సమావేశాలు.. 2023-24 ఎపిసిపిడిసిఎల్ 5వ వార్షిక నివేదిక. 2023-24 ఎపిఇపిడిసిఎల్ 24వ వార్షిక నివేదికలను సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్.. 2019-24 మధ్యకాలంలో జరిగిన కుంభకోణాలపై స్వల్పకాలిక చర్చ..
* అమరావతి: ఇవాళ మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో.. సామాజిక భద్రతా పింఛన్లు.. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు.. పర్మిట్ రూంలకు అనుమతి.. ఈహెచ్ఎస్, ఆరోగ్యశ్రీ పథకాలు.. సీజీఎఫ్ కింద దేవాలయాల నిర్మాణం.. నూతన పర్యాటక విధానం.. గిరిజన ప్రాంతాల్లో పర్యాటకం.. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా.. ఆడబిడ్డ నిధి పథకం.. జగనన్న కాలనీల్లో అక్రమాలపై చర్చ
* తిరుమల: నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.. ఇవాళ తెప్పలపై విహరించనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. ఇవాళ తెప్పలపై ఏడు ప్రదక్షిణలకు వివరించనున్న స్వామివారు.. ఇవాళ ఆర్జిత బ్రహ్మోత్సవం,సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టిటిడి
* హైదరాబాద్: నేడు తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ
* గుంటూరు: నేడు మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ పర్యటన.. లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొననున్న లోకేష్.
* తిరుమల: రేపు పౌర్ణమి గరుడ వాహన సేవ.. రేపు రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* తిరుమల: రేపు కుమారధార తీర్ద ముక్కోటి.. రేపు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను తీర్దానికి అనుతించనున్న టిటిడి
* కాకినాడ: రేపు చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ, హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 50 ఎకరాల ప్రాంగణంలో జయ కేతనం పేరుతో ఆవిర్భావ సభ నిర్వహిస్తున్న జనసేన.. అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత తొలి ఆవిర్భావ సభ.. సాయంత్రం నాలుగు గంటల నుంచి 9 గంటల వరకు జరగనున్న సభ.. సభా వేదికపై 250 మంది ప్రతినిధులు
* అనంతపురం : యాడికి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి చెన్న కేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు గజేంద్రోత్సవం.
* అనంతపురం : నగరంలోని శివకోటి శ్రీ పీఠంలో నేడు సామూహిక సత్యనారాయణ స్వామి వత్రాలు.
* విజయవాడ: నేడు వల్లభనేని వంశి బెయిల్ పిటిషన్ పై విచారణ జరపనున్న ఎస్సీ, ఎస్టీ కోర్టు
* కడప : నేడు జ్యోతి క్షేత్రాన్ని సందర్శించనున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి…
* కర్నూలు: నేడు ఆలూరు మండలం పెద్దహోతూర్ లో శ్రీ వుచ్చీరప్ప తాత రథోత్సవం…
* తిరుమల: 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 68,509 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,105 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.86 కోట్లు
* శ్రీ సత్యసాయి : చిలమత్తూరు కనుమ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా నేడు స్వామివారి కల్యాణోత్సవం
* కర్నూలు: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో నేడు స్వామి వారి మూలబృందావనంకు తుంగ జలంతో అభిషేకం, తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషేకం వంటి ప్రత్యేక పూజలు… సాయంత్రం ఉత్సవ మూర్తి ప్రహ్లదరాయులను ఉంజల సేవ, బంగారు పల్లకి, గజ వాహనం, నవరత్న స్వర్ణ రథంపై ఉరేగింపు.