Fraud: ఇటలీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నిండా ముంచాడు ఓ కేటుగాడు.. సుమారు 360 మంది నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెట్టి మోసగించాడు ఇచ్చాపురంకు చెందిన ఏజెంట్ కొచ్చెర్ల ధర్మా రెడ్డి. అయితే, ఒక్కొక్కరి దగ్గర నుంచి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేసి.. సుమారు 6 కోట్ల రూపాయలతో విదేశాలకు జంప్ అయ్యాడు కేటుగాడు ధర్మారెడ్డి.
Godavari: సీలేరు జలాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని మూడు డెల్టాల పరిధిలో రబీ వరి పంటకు జీవం పోస్తున్నాయి. సీలేరు జలాశయం నుంచి ప్రతి రోజు 7 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు అధికారులు.
CM Chandrababu: ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీఎల్పీ సమావేశం కొనసాగుతుంది. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో కూడా మంచి బడ్జెట్ ప్రజలకు అందిస్తున్నాం అని పేర్కొన్నారు.
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చిక్కుల్లో పడ్డారు.. గురువారం రోజు మాధవ్ మీడియాతో మాట్లాడు చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు టీడీపీ, జనసేన నేతలు.. అయితే, నిన్న మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. రాష్ట్రంలో అంతర్యుద్ధం మొదలవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కూటమి నేతలు.. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు..
పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన న్యాయ వాది మధు.. రైల్వేకోడూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, రేపటి నుంచి రైల్వే కోడూరు జడ్జ్ ట్రైనింగ్ కోసం వెళ్తున్న కారణంగా ఈ కేసును శుక్రవారం విచారణకు తీసుకోలేదు. ఇక, శనివారం, ఆదివారం సెలవు కావడంతో సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. 2025 - 26 వార్షిక బడ్జెట్‌తో పాటు.. వ్యవసాయ బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది.. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే.. శాసన సభలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. రూ.48,340 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీ ముందు ఉంచారు..
నష్ట పోయిన రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని సూచించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. చాలా మంది కొత్త సభ్యులు ఉన్నారు.. దాంతో పాటు.. ఇప్పటికే ఎన్నో బడ్జెట్లను సూచిన సభ్యులు కూడా ఉన్నారని తెలిపిన ఆయన.. బడ్జెట్ ను అందరూ చదవాలి.. బడ్జెట్ పత్రాలను అన్ని పెన్ డ్రైవ్ లో ఇస్తాం. సభ్యులు వాట్సాఅప్ గ్రూప్ లో పెట్టుకోవాలి. నియోజకవర్గ పరిధిలో సరళ మైన భాషతో బడ్జెట్‌పై చెప్పాలని సూచించారు..
పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. అయితే, పోసాని కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. ఐటీ యాక్ట్ చెల్లదని సుప్రీంకోర్టు చెప్పింది.. పోసానిపై త్రిబుల్ వన్ కేసు పెట్టడానికి వీలులేదన్నారు.. వర్గ వైశమ్యాలను రెచ్చగొట్టే సెక్షన్లు వల్లే రిమాండ్ ఉంటుంది..