సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల వ్యవహారంలో అరెస్టయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్పై నేడు విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. పోలీసులు ఇవాళ కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు.
Vallabhaneni Vamsi Wife: విజయవాడలోని కోర్టు దగ్గర వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ మాట్లాడుతూ.. మూడు రోజులు కోర్టు అనుమతించిన పోలీస్ కస్టడీ తర్వాత మళ్లీ వంశీని న్యాయస్థానం నుంచి సబ్ జైలుకు తరలించడం జరిగిందన్నారు. మూడు రోజులు పోలీసులు కస్టడీలో నా భర్తను అర్థం పర్థం లేని కేసుకు సంబంధం లేని ప్రశ్నలతో విసిగించారు అని ఆరోపించింది.
Tirupati Stampede: తిరుమల తిరుపతి కొండపై జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతుంది. వర్చువల్ విధానంలో తొక్కిసలాట బాధితులను రిటైర్డ్ న్యాయమూర్తి విచారించారు. తిరుపతి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయం నుంచి విచారణ జరిపారు.
సమాజంలో పేదలకు ప్రభుత్వం అండగా ఉండటమే పీ- 4 ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. పీ-4 కోసం నిర్మాణాత్మకమైన స్థిరమైన విధానం ఉండాలి.. అర్హత ఉన్న కుటుంబాలను డేటా బేస్, హౌస్ హోల్డ్, గ్రామసభ ద్వారా గుర్తించాలి అని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట భూములు ఉన్న వారికి P4 నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం చంద్రబాబు తెలిపారు.
Gorantla Madhav: అనంతపురం జిల్లాలో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వచ్చారు. సెక్షన్ 35/ త్రి బీఎన్ఎస్ కింద గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చారు. మార్చ్ 5వ తేదీన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని మాజీ ఎంపీ మాధవ్ కు నోటీసులు అందజేశారు.
KRMB : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన నీటి వివాదాలను పరిష్కరించేందుకు కృష్ణా నదీ నిర్వహణ మండలి (KRMB) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి పంపిణీ, వృధా కాకుండా సరైన వినియోగం, తాగునీటి ప్రాధాన్యత వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాగునీటికి ప్రాధాన్యం – రెండురాష్ట్రాలకు బోర్డు సూచన KRMB రెండు రాష్ట్రాలకు తాగునీటి అవసరాలను అత్యంత ప్రాధాన్యతతో చూడాలని సూచించింది. ప్రజలకు తాగునీరు అందించడమే మొదటి బాధ్యతగా…
Posani Krishna Murali: అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో లో సినీ నటుడు పోసాని కృష్ణ మురళి విచారణ కొనసాగుతుంది. దాదాపుగా ఐదు గంటల పాటు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, సీఐ వెంకటేశ్వర్లు విచారిస్తున్నారు.
Vallabhaneni Vamsi: గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు మూడు రోజుల పాటు విచారించిన తర్వాత కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ ముందు వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. జైలులోనిసెల్ లో తనను ఒంటరిగా ఉంచారని న్యాయమూర్తికి తెలిపారు.
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక, ఆంధ్రప్రదేశ్ లో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే, సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.