AP New DGP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పోలీస్ బాస్ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది.. డీజీపీ ఎంపిక కోసం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు కేంద్రానికి పంపింది ఏపీ ప్రభుత్వం.. సీనియర్ ఐపీఎస్ అధికారులైన మాదిరెడ్డి ప్రతాప్.. రాజేంద్ర నాథ్‌రెడ్డి.. హరీష్ కుమార్ గుప్తా.. కుమార్ విశ్వజిత్.. సుబ్రహ్మణ్యం పేర్లు కేంద్రానికి పంపించింది ఏపీ సర్కార్.. అయితే, వీరిలో మూడు పేర్లు ఎంపిక చేసి తిరిగి ఏపీ ప్రభుత్వానికి పంపనుంది కేంద్రం.. ప్రస్తుతం ఏపీ ఇంఛార్జ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా కొనసాగుతోన్న విషయం విదితమే.. డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంఛార్జ్‌ల నుంచి పూర్తిస్థాయి డీజీపీ నియామాకానికి మొగ్గు చూపిన రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీ ద్వారా డీజీపీని ఎంపిక చేసి రెండేళ్లపాటు కొనసాగించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, అందులో మెరిట్ ఆధారంగా హరీష్ కుమార్ గుప్తా పేరు ఉంటుందని, మరో రెండేళ్లపాటు ఆయనకు పోలీస్ బాస్ అవకాశం లభిస్తుందనే ప్రచారం సాగుతోంది..
Read Also: Varalakshmi : ఆరుగురు లైంగికంగా వేధించారు.. వరలక్ష్మీ షాకింగ్ కామెంట్స్