జైలు నుంచి పోసాని విడుదలలో జాప్యం..! అంబటి సంచలన ఆరోపణలు..
శుక్రవారం రోజు బెయిల్ వచ్చినా.. పోసాని కృష్ణ మురళి విడుదలలో జాప్యం అయ్యింది.. ఓ దశలో నిన్నే రిలీజ్ అవుతారనే ప్రచారం జరిగింది.. అది సాధ్యం కాకపోవడంతో.. ఈ రోజు ఉదయమే విడుదలకు పోసాని లాయర్లు ఏర్పాట్లు చేశారని చెప్పారు.. కానీ, ఎట్టకేలకు 24 రోజుల ఉత్కంఠకు తెర దించుతూ.. గుంటూరు జిల్లా జైలు నుంచి ఈ రోజు సాయంత్రం 4.50 గంటలకు విడుదలయ్యారు పోసాని కృష్ణమురళి.. జైలు బయట పోసానిని కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు.. మంత్రి నారా లోకేష్ చెప్పటం వల్లే మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు బయటకు వదలకుండా ఆపారు.. లోకేష్ కనుసన్నలలో అంతా నడుస్తుందని ఆరోపించారు.. 24 రోజుల నిర్బంధం తర్వాత పోసాని జైలు నుంచి రిలీజ్ అయ్యారు.. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోసాని మాట్లాడలేదన్న ఆయన.. పోసాని హత్యలు, దొంగతనాలు, దోపిడీలు చేయలేదు.. మీడియా ముందు మాట్లాడారని కేసులు పెట్టారు.. రెండు ప్రెస్ మీట్లు పెడితే 18 కేసులు పెట్టి 24 రోజులు నిర్బంధించారు.. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు, జైళ్ల చుట్టూ తిప్పారు.. మీడియాలో దూషించారని కేసులు కట్టారు.. టీడీపీ వాళ్లు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడినా కేసులు పెట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష.. ఆ నిధుల పరిస్థితి ఏంటి..?
ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖలో స్థితిగతులపై చర్చించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అధికారులతో రివ్యూ చేశారు. కేంద్రంలోని ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు.. కేంద్ర పథకాలకు సంబంధించి అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించి.. సకాలంలో నిధులు విడుదల అయ్యేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. అయితే, కేంద్ర పథకాలకు సంబంధించి 5 శాఖల నిధులు రావాల్సి ఉందని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలపగా.. కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్థిక సంవత్సరం ముగింపులోగా ఆ నిధులు తెచ్చుకోవాలని తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన ఈ రివ్యూకి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ సెక్రటరీ రోనాల్డ్ రోస్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
30 ఫిర్యాదులు.. 17 కేసులు..! 24 రోజుల జైలు జీవితం..
సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు ఈ రోజు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదల అయ్యారు.. దీంతో, 24 రోజుల ఉత్కంఠకు తెరపడినట్టు అయ్యింది.. అయితే, ఇతర కేసుల్లో బెయిల్ మంజూరు అయినా.. పోసానికి సీఐడీ నమోదు చేసిన కేసులో కూడా బెయిల్ దక్కడంతో గుంటూరు జైలు నుంచి బయటకు వచ్చారు.. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే తన సన్నిహితులతో కలసి హైదరాబాద్ కు బయల్దేరి వెళ్లారు పోసాని కృష్ణ మురళి.. అయితే, పోసాని వ్యవహారం 30 ఫిర్యాదులు.. 17 కేసులు.. 24 రోజుల జైలు జీవితంలా సాగింది.. ఎట్టకేలకు 24 రోజుల ఉత్కంఠకు తెర పడింది.. సీఐడీ కేసులో గుంటూరు జిల్లా జైలులో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి నుంచి బెయిల్ పై ఇవాళ విడుదలయ్యారు.. సాయంత్రం 4.50 గంటల సమయంలో జిల్లా జైలు అధికారులు పోసానిని రిలీజ్ చేశారు.. జైలు బయటకు వచ్చిన పోసానిని మాజీ మంత్రి అంబటి రాంబాబు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.. బాగున్నానని అంబటికి పోసాని అందరికీ అభివాదం చేసి తన సన్నిహితుల వాహనంలో హైదరాబాద్ వెళ్ళిపోయారు.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. సోషల్ మీడియాలో పోస్టులు చేశారన్న ఆరోపణలపై గత ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వివిధ పోలీస్ స్టేషన్‌లకు.. కోర్టులకు.. జైళ్లకు.. పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్ లపై తిప్పారు.. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్ అయ్యారు.
కొత్త డీజీపీ ఎంపికపై కసరత్తు.. కేంద్రానికి ఐదుగురి పేర్లు పంపిన ఏపీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పోలీస్ బాస్ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది.. డీజీపీ ఎంపిక కోసం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు కేంద్రానికి పంపింది ఏపీ ప్రభుత్వం.. సీనియర్ ఐపీఎస్ అధికారులైన మాదిరెడ్డి ప్రతాప్.. రాజేంద్ర నాథ్‌రెడ్డి.. హరీష్ కుమార్ గుప్తా.. కుమార్ విశ్వజిత్.. సుబ్రహ్మణ్యం పేర్లు కేంద్రానికి పంపించింది ఏపీ సర్కార్.. అయితే, వీరిలో మూడు పేర్లు ఎంపిక చేసి తిరిగి ఏపీ ప్రభుత్వానికి పంపనుంది కేంద్రం.. ప్రస్తుతం ఏపీ ఇంఛార్జ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా కొనసాగుతోన్న విషయం విదితమే.. ప్రస్తుత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సైతం విజిలెన్స్ డీజీగా ఉంటూ డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంఛార్జ్‌ల నుంచి పూర్తిస్థాయి డీజీపీ నియామాకానికి మొగ్గు చూపిన రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీ ద్వారా డీజీపీని ఎంపిక చేసి రెండేళ్లపాటు కొనసాగించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, అందులో మెరిట్ ఆధారంగా హరీష్ కుమార్ గుప్తా పేరు ఉంటుందని, మరో రెండేళ్లపాటు ఆయనకు పోలీస్ బాస్ అవకాశం లభిస్తుందనే ప్రచారం సాగుతోంది..
పులివెందులలో వైసీపీకి బిగ్ షాక్..
పులివెందుల.. ఈ పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం… ఈ నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి కంచుకోట.. 1978లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి నేడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హయం వరకు అక్కడ ఏ ఎన్నిక జరిగినా వైఎస్ కుటుంబానికి ఎదురు ఉండేది కాదు. అక్కడ వారు చెప్పిందే వేదం.. వారు చేసిందే శాసనం.. పులివెందుల చరిత్రలో మొట్టమొదటిసారిగా సాగునీటి సంఘాల ఎన్నికల్లో 32 స్థానాలకు గాను, 32 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది… ఇదే టీడీపీ విజయానికి తొలిమెట్టు… ఇదే పంతాతో పులివెందుల మున్సిపాలిటీపై దృష్టి సారించిందట టీడీపీ.. జగన్ అడ్డాలో టీడీపీ జెండా పాతేందుకు, అసంతృప్తి కౌన్సిలర్లకు బంపర్ ఆఫర్లు ఇస్తోందట.. కాంట్రాక్ట్ పనులతో పాటు రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు సీట్లు ఇస్తామంటూ వైసీపీ కౌన్సిలర్లకు ఎర వేస్తోందట టీడీపీ..
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది
ఇవాళ చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీని వ్యతిరేకించే పక్షాలు- కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, కమ్యూనిస్టులు సమావేశమవడం.. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. అసలు నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించాల్సిన విధి విధానాలు ఖరారు కానే కాలేదు, నియమ నిబంధనలు రూపొందించనే లేదు, కానీ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ ఈ పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. పైకి నియోజకవర్గాల పునర్విభజన అని చెప్తున్నప్పటికీ, వాస్తవానికి వారి ఎజెండా బీజేపీపై విషం కక్కడమేననేది స్పష్టమవుతోందని, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో గ్యారెంటీల హామీల అమలు వైఫల్యాలతో కాంగ్రెస్, తమిళనాడులో అవినీతి కుటుంబ పాలనతో డీఎంకే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటున్నాయన్నారు కిషన్ రెడ్డి. అటు బీఆర్ఎస్ అధికారం కోల్పోయి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేకపోయింది, ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేసే ధైర్యం కూడా చేయలేదని, ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించి, భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన తీసుకువచ్చేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
బెంగళూర్‌లో భారీ వర్షం.. చెన్నైకి విమానాల మళ్లింపు..
కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో బెంగళూర్ వెళ్లాల్సిన కనీసం 10 విమానాలను చెన్నైకి మళ్లించినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. బెంగళూర్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు విమాన సేవలపై ప్రభావం చూపిస్తున్నాయని ఇండిగో ఎక్స్‌లో పేర్కొంది. తమ బృందాలు వాతావరణాన్ని గమనిస్తున్నాయని, పరిస్థితులు మెరుగైన తర్వాత సకాలంలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తామని చెప్పింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా బెంగళూరులో విమాన కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని, ఫలితంగా విమాన ట్రాఫిక్ రద్దీ ఏర్పడిందని ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లే ముందు ఫ్లైట్ స్టేటస్ కనుక్కోవాలని సూచించింది. బెంగళూర్‌లో భారీ వర్షాలకు కొన్ని రోడ్లు జలమయం అయ్యాయని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడినట్లు ప్రజలు సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. బెంగళూర్ ట్రాఫిక్ పోలీసులు కూడా విమానశ్రయానికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ గురించి అప్రమత్తం చేశారు.
‘‘దిశా సాలియన్ మృతిలో ఆదిత్య పేరు తీసుకురావద్దని ఉద్ధవ్ ఠాక్రే కోరాడు..’’
సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మరణం మరోసారి వార్తాంశంగా మారింది. దిశా తండ్రి సతీష్ సాలియన్ తన కూతురుపై సామూహిత్య అత్యాచారం జరిగిందని ఆరోపిస్తూ, బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే పేరు ఉండటం ఇప్పుడు రాజకీయంగా ఈ కేసులు ప్రాధాన్యత సంతరించుకుంది. దిశా సాలియన్ ముంబైలోని ఒక అపార్ట్‌మెంట్ 14వ అంతస్తు నుంచి పడిపోయిన చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన ఆరు రోజులకే, దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దిశా సాలియన్ సుశాంత్‌కి కూడా మేనేజర్‌గా పనిచేసింది. వీరిద్దరూ ప్రేమించుకున్నారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ వ్యవహారంలో శనివారం, బీజేపీ నేత, కేంద్రమంత్రి నారాయణ రాణే సంచలన విషయాలు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘‘ఉద్ధవ్ ఠాక్రే తనకు ఫోన్ చేసి ఈ కేసులో తన కొడుకు ఆదిత్య ఠాక్రే పేరు తీసుకురావద్దని కోరారు’’ అని చెప్పాడు. ‘‘ఉద్ధవ్ థాకరే నాకు రెండుసార్లు కాల్ చేసాడు. నాకు మొదటిసారి కాల్ వచ్చినప్పుడు, నేను ముంబైలోని జుహులో ఉన్న నా ఇంటికి వెళ్తున్నాను. ఠాక్రే మాట్లాడుతూ..మీకు పిల్లలు ఉన్నారు. నాకు కూడా ఉన్నారు. మీరు ఈ కేసు గురించి మాట్లాడేటప్పుడు ఆదిత్య ఠాక్రే పేరు ప్రస్తావించవద్దు అని నన్ను అభ్యర్థించారు. ’’ అని నారాయణ్ రాణే విలేకరుల సమావేశంలో చెప్పాడు.
విరాట్ కోహ్లీ పేరిట మరో రికార్డు.. టీ20 కెరీర్‌లో అరుదైన ఘనత..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ప్రారంభమైంది. 2008లో ప్రారంభమైన ఈ మెగా లీగ్.. ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకుంది. 8 జట్లతో మొదలైన ఈ లీగ్ లో ప్రస్తుతం పది టీమ్స్ ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడతున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి మరో రికార్టు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో విరాట్ 400వ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇప్పటికే ఈ రికార్డులో రోహిత్ శర్మ (448 మ్యాచ్‌లు), దినేష్ కార్తీక్ (412 మ్యాచ్‌లు) ఉన్నారు. ఇప్పుడు విరాట్ మూడో స్థానికి చేరుకున్నాడు. ఐపీఎల్ మొదటి సీజన్ 2008లో ప్రారంభమైన విషయం తెలిసిందే. అదే ఏడాది విరాట్ కోహ్లీ టీ20లోకి అడుగు పెట్టాడు. 382 ఇన్నింగ్స్‌ల్లో 41.43 సగటుతో 12,886 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, 97 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇప్పటికే విరాట్ పేరిట పలు రికార్డులు ఉన్నాయి. టీ20ల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అంతే కాకుండా… ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు.
పాపం దిల్ రాజు . . ‘నవ్వులాట’ టెన్షన్
అనూహ్యంగా దిల్ రాజు మరోసారి వార్తల్లోకి వచ్చాడు. తాజాగా జరిగిన మోహన్ లాల్ సినిమా L2: ఎంపురాన్ ఈవెంట్‌లో గేమ్ చేంజర్ ప్రస్తావన రావడంతో ఒక్కసారిగా ఆడియన్స్ నుంచి పెద్ద ఎత్తున అరుపులు, కేకలు వినిపించాయి. కొంతమంది గట్టిగా నవ్వేశారు. దీంతో స్టేజ్ మీద ఉన్న దిల్ రాజు కూడా నవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన సీరియస్ అవ్వలేక నవ్వేశాడు. కానీ కెమెరాలో మాత్రం గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ అనే మాట వినగానే దిల్ రాజు నవ్వినట్టుగా అనిపించింది. దీంతో సోషల్ మీడియాలో దిల్ రాజు మీద ట్రోలింగ్ మొదలైంది. సొంత సినిమా సక్సెస్ అయితే తమ క్రెడిట్ అన్నట్టు, ఫెయిల్ అయితే దర్శకుడి ఫెయిల్యూర్ అన్నట్టు ఇలా నవ్వడం కరెక్ట్ కాదంటూ ఆయన మీద పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా దిల్ రాజు ఇలా చేయడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్యనే తమన్ కూడా ఇదే విధమైన కామెంట్ చేయడంతో ఆయన్ని కూడా టార్గెట్ చేసి సోషల్ మీడియా యూజర్లు ఆడుకున్నారు. అయితే తాజాగా దిల్ రాజు తప్పు లేకపోయినా ఈ రోజు కార్నర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి గేమ్ చేంజర్ సినిమాకు ఈ రోజు జరిగిన ఎంపురాన్ ఈవెంట్‌కు ఏ మాత్రం సంబంధం లేదు. కానీ దిల్ రాజు గేమ్ చేంజర్ నిర్మాత కావడం, ఈ సినిమాను రిలీజ్ చేస్తూ ఉండడంతో ఆ సినిమాకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తర్వాత, కేవలం ఎంపురాన్ సినిమా గురించి మాత్రమే మాట్లాడాలని జర్నలిస్టులను ఆయన కోరారు.
ఆరుగురు లైంగికంగా వేధించారు.. వరలక్ష్మీ షాకింగ్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు అనేవి చాలా సార్లు తెరమీదకు వచ్చాయి. నటీమణులు తమకు ఎదరైన చేదు అనుభవాలను ఎన్నోసార్లు బయటపెట్టారు. కాస్టింగ్ కౌచ్ పేరుతో వేధింపులకు గురయ్యామంటూ వారు చెప్పుకుని ఎమోషనల్ అయిపోయేవారు. అయితే తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ఆమె సినిమాల్లో లేడీ విలన్ గా బాగా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. సినిమాల్లో కీలక పాత్రలు కూడా చేస్తోంది. పెళ్లి అయిన తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది ఈ భామ. అయితే తాజాగా ఆమె ఓ టీవీ షోకు జడ్జిగా వెళ్లింది. అక్కడ ఓ లేడీ కంటెస్టెంట్ తనకు జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. దీంతో వరలక్ష్మీ కూడా తాను ఫేస్ చేసిన వాటిని తెలిపింది. ‘నీది నాది సేమ్. నేను కూడా చిన్నవయసులో చాలా చేదు అనుభవాలను ఎదుర్కున్నాను. నన్ను కూడా ఐదారుగురు వేధించేవారు. కానీ నేను ఎప్పుడూ భయపడలేదు. ధైర్యంగా ముందుకు వెళ్లాను. మన హార్డ్ వర్క్ మనల్ని పైకి తీసుకొస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంత పెద్ద హీరో కూతురుకు కూడా వేధింపులు తప్పలేవా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
గ్లామరస్ గా శ్రియ శరణ్.. హాట్ ఫోజులు
సీనియర్ హీరోయిన్ శ్రియ చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఆమె ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు దాటిపోతున్నా ఆమెకు అవకాశాలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. పైగా ఇన్నేళ్లుగా ఆమె అందంలో కూడా మార్పు రాలేదు. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ లుక్స్ ను మరింత పదును పెట్టుకుంటోంది. సినిమాల్లో హీరోయిన్ పాత్రలు రాకపోయినా కీలక పాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. ఒక పాప పుట్టిన తర్వాత కూడా తన అందం చెక్కు చెదరనీయలేదు. ఆ అందాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చూపిస్తూ ఫాలోయింగ్ పెంచేసుకుంటోంది. తాజాగా మరోసారి హాట్ ఫోజులు ఇచ్చింది ఈ బ్యూటీ. ఇందులో బ్లూ కలర్ డ్రెస్సులో రెచ్చిపోయింది. తన ముందరి అందాలను కెమెరాకు చూపిస్తూ కుర్రాళ్లకు వల విసురుతోంది. ఆమె ఇచ్చిన తాజా హాట్ ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇందులో ఆమె చాలా హాట్ గా కనిపిస్తోంది. ఇంత ఘాటుగా అందాలను చూపించిన తర్వాత ఆ ఫొటోలు వైరల్ కాకుండా ఉంటాయా.. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.