Big shock to YSRCP: పులివెందుల.. ఈ పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం… ఈ నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి కంచుకోట.. 1978లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి నేడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హయం వరకు అక్కడ ఏ ఎన్నిక జరిగినా వైఎస్ కుటుంబానికి ఎదురు ఉండేది కాదు. అక్కడ వారు చెప్పిందే వేదం.. వారు చేసిందే శాసనం.. పులివెందుల చరిత్రలో మొట్టమొదటిసారిగా సాగునీటి సంఘాల ఎన్నికల్లో 32 స్థానాలకు గాను, 32 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది… ఇదే టీడీపీ విజయానికి తొలిమెట్టు… ఇదే పంతాతో పులివెందుల మున్సిపాలిటీపై దృష్టి సారించిందట టీడీపీ.. జగన్ అడ్డాలో టీడీపీ జెండా పాతేందుకు, అసంతృప్తి కౌన్సిలర్లకు బంపర్ ఆఫర్లు ఇస్తోందట.. కాంట్రాక్ట్ పనులతో పాటు రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు సీట్లు ఇస్తామంటూ వైసీపీ కౌన్సిలర్లకు ఎర వేస్తోందట టీడీపీ..
Read Also: Raashi khanna : రాశిఖన్నా అందాల జాతర
పులివెందుల మున్సిపాలిటీలో 32 మంది కౌన్సిలర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానాలు అన్నింటినీ వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.. ప్రస్తుతం పదిమంది కౌన్సిలర్లు వైసీపీని వీడి సైకిల్ ఎక్కడానికి సిద్ధమయ్యారట. గత రెండు రోజులుగా ఇద్దరు కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారట.. మరో ఎనిమిది మంది కౌన్సిలర్లు కూడా సైకిల్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారట. నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో కుప్పం మున్సిపాలిటీని వైసీపీ ఎలా కైవసం చేసుకుందో, నేడు టీడీపీ కూడా అదే పంతాను అనుసరిస్తోందట.. వైసీపీ కౌన్సిలర్లలో ఉన్న అసంతృప్తి టీడీపీకి అనుకూలిస్తోందట.. గత సార్వత్రిక ఎన్నికల ముందు పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లు తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చర్చలు జరిపిన వారు శాంతించలేదట. అధినేత నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆ కౌన్సిలర్లు అసంతృప్తిని వీడలేదట. పులివెందుల మున్సిపల్ ఇంఛార్జ్‌గా ఉన్న వైసీపీ నేత వైఎస్ భాస్కర్ రెడ్డి ఎన్నికల అనంతరం ఆయన తన మకాంను హైదరాబాద్ కు మార్చారట.. తమ గోడును వినే నాధుడు కరువయ్యారట.. ఇదే అదునుగా భావించిన టీడీపీ అసంతృప్తి వైసీపీ కార్పొరేటర్లకు బంపర్ ఆఫర్లు ఇస్తోందట.. మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పనులతో పాటు రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్లు ఇస్తామంటూ, ఆఫర్లపై, ఆఫర్లు టీడీపీ ఇవ్వడంతో సైకిల్ ఎక్కడానికి కౌన్సిలర్లు సిద్ధమయ్యారట.. గత కొద్ది రోజులు క్రితం ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారట.. మరో ఎనిమిది మంది సైకిల్ ఎక్కడానికి సిద్ధమయ్యారట..
Read Also: Disha Salian case: ‘‘దిశా సాలియన్ మృతిలో ఆదిత్య పేరు తీసుకురావద్దని ఉద్ధవ్ ఠాక్రే కోరాడు..’’
అయితే, వెంటనే అప్రమత్తమైన వైసీపీ నేతలు అసంతృప్తి కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారట.. పార్టీని వీడకుండా ఉండేవిధంగా చర్యలు చేపట్టారు.. అయినా టీడీపీ మాత్రం ఆపరేషన్ వైసీపీని వదలడంలేదనే చర్చ సాగుతోంది.. కౌన్సిలర్లతో మరింత వేగంగా మంతనాలు మొదలుపెట్టిందట.. వైసీపీ అధినేత అడ్డాలో కౌన్సిలర్ల సమస్యలే టీడీపీ ఆయుధంగా మార్చుకుందట… ఇంత జరుగుతున్న వైసీపీ అధినేత దృష్టికి వెళ్లకపోవడం ఇక్కడ కొసమెరుపు అంటున్నారు.. అసంతృప్తి కౌన్సిలర్ల వ్యవహారం అధినేత వద్దకు వెళ్లకుండా కిందిస్థాయి నేతలే ఈ తతంగమంతా నడిపారట.. నమ్మినవారే వైసీపీని ముంచారంటూ పులివెందులలో గుసగుసలు వినిపిస్తున్నాయట.. వైసీపీ హయాంలో ఆ ఐదు మంది కౌన్సిలర్ల కే ప్రాధాన్యత ఇవ్వడం, మిగిలిన కౌన్సిలర్లు జీర్ణించుకోలేకపోయారట.. ఇకనైనా వైసీపీ అధినేత సొంత నియోజకవర్గంలో పార్టీకి ట్రీట్మెంట్ చేస్తారో, లేదో వేచి చూడాల్సిందే..