బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి, వైసీపీపైన ఆయన విరుచుకుపడ్డారు. కూటమి లక్ష్యం వైసీపీని ఖాళీ చేయడం.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20శాతం ఓట్లు రాకుండా చేయడమే మా లక్ష్యమని అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమక్షంలో పలువురు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు 150మందికి పైగా బీజెపీలో చేరారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. 60 అసెంబ్లీ సీట్లు వచ్చినప్పుడు సభకు వెళ్ళలేదు.. ఇప్పుడు ప్రజలు ఇవ్వకపోతే.. ప్రతిపక్ష అర్హత కావాలని అడుగుతున్నారు.. జగన్ వైఖరి రెండు నాలుకల ధోరణికి నిదర్శనం.
Also Read:Aamir Khan : ఆమె వల్ల నరకం అనుభవించా.. అమీర్ ఖాన్ ఎమోషనల్..
జగన్ కు మరోసారి అధికారం అంటే ఆంధ్రా అభివృద్ధికి విఘాతం అనేది బీజెపీ స్పష్టమైన అభిప్రాయం.. వైజాగ్ కేపిటల్ అని ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు కానీ, 500కొట్లతో ప్యాలస్ కట్టుకున్నారు.. ఆయనకు మళ్ళీ అధికారం కోరే హక్కు లేదు.. నాయకులు వల్లే స్టీల్ ప్లాంట్ నష్టపోయింది.. ఉద్యమం వల్ల నష్టం చేస్తున్నారు.. అక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు..?మీ ఆస్తులు ఎంత, ఎక్కడ నుంచి వచ్చాయి అని ప్రశ్నించారు.
Also Read:Suicide: ఢిల్లీ డీర్ పార్క్‌లో చెట్టుకు ఉరివేసుకుని టీనేజర్లు ఆత్మహత్య..
త్వంలో ఒక రూట్ మ్యాప్ ఉంటుంది.. అది బహిర్గతంగా కనిపించదు.. ఇప్పుడు రాష్ట్రంలో విస్తృతమైన అభివృద్ధి జరుగుతోంది.. అసెంబ్లీకి వెళ్ళను అనే వ్యక్తా ఆంధ్ర ప్రజలకి కావాల్సింది… అని బిజెపి నుంచి సూటిగా ప్రశ్నిస్తున్నాము. స్టీల్ ప్లాంట్ నష్ట పోవడానికి ప్రధాన కారణం కార్మిక సంఘాల నాయకులు.. ఎక్కడ నుండి వచ్చారు, ఎంత ఆస్తులు సంపాదించారు, ఉద్యమాలు చేస్తూ రెచ్చగొట్టి పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నరు. సవాల్ చేస్తున్న కార్మిక సంఘాలకి రాజకీయాలు చేయకుండా, కష్టపడి లాభాల్లోకి తీసుకువెళ్లగలరా. ఏ సమయంలో ఏలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ప్రధాని నరేంద్ర మోడీకి స్పష్టంగా తెలుసు. వికసిత భారత్, స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యంతో కూటమి ముందుకు వెళుతుందని సోము వీర్రాజు తెలిపారు.