Minister Narayana: నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలను అభివృద్ధి చేశాం.. కానీ, గత వైసీపీ ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేసింది అని ఆరోపించారు. ఖజానా ఖాళీ చేసి వెళ్ళింది.. రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పు మిగిల్చి వెళ్ళింది అని మండిపడ్డారు. ఇక, ప్రజా మద్దతుతో తిరిగి మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
Read Also: Irfan Pathan: “నేను దీన్ని సమర్థించను”.. ధోని బ్యాటింగ్ ఆర్డర్‌పై ఇర్ఫాన్ పఠాన్ రియాక్షన్..
ఇక, రాష్ట్ర ప్రజలకు సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఆగిపోయాయి.. ఈ పనులను వచ్చే ఏడాదిలో పూర్తి చేస్తాం.. అలాగే, ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా 2 రూపాయలకే 20 లీటర్లు మంచి నీటిని ఇచ్చే పథకాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. నెల్లూరు నగరంలో ఏసీ బస్ షెల్డర్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదే.. వాటిని కూడా జగన్ సర్కార్ నిరుపయోగం చేసింది.. వాటినీ తిరిగి ఉపయోగంలోకి తీసుకోస్తామని మంత్రి నారాయణ తెలిపారు.