Lovers suicide: విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. తమ ప్రేమకు పెద్దలు అంగీకరించక పోవడంతో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. ప్రియుడు అమీర్ ఉద్దీన్ ఖాన్ (36)కు ఇది వరకే పెళ్లైంది.. కానీ, మళ్లీ వెంకట దుర్గను ప్రేమించి పెళ్లి చేసుకోవడం కోసం నెల రోజుల క్రితం భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు అమీర్.. అయితే, ఏడాదిగా సింహాచలంలోని గోశాల వద్ద టిఫిన్ దుకాణం నడుపుతున్న పిన్నింటి జయశ్రీ దగ్గర అతడు చెఫ్‌గా పని చేస్తున్నాడు. జయశ్రీ కుమార్తెతో చనువుగా ఉంటూ ప్రేమలోకి దించిన అమీర్.. తన కుమార్తెతో అమీరుద్దీన్ ఖాన్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో అతడిని పని నుంచి తొలగించింది జయశ్రీ.
Read Also: Vishnu Priya: హైకోర్టులో విష్ణు ప్రియకు షాక్.. మరోసారి పంజాగుట్ట పోలీసుల ముందుకు నటి
అయితే, జయశ్రీ తన కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తోంది. ఇక, తాను ఇష్టపడిన అమీరుద్దీన్‌ఖాన్‌తో పెళ్లికి తల్లి అంగీకరించే ప్రసక్తి లేదని తెలుసుకున్న వెంకట దుర్గా.. తల్లి టిఫిన్ దుకాణానికి వెళ్లిపోయిన తరువాత వడ్లపూడిలో ఉన్న ప్రియుడిని కలవడానికి వెళ్లింది. అక్కడే, గదిలో ప్రియుడితో కలిసి ఉరెసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు దువ్వాడ పోలీసులు. పోస్టుమార్టం కోసం మృత దేహాలను కేజీహెచ్ కు తరలించారు.