* నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. హాజరుకానున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఇతర టీడీపీ నేతలు..
* నేడు కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ పర్యటన.. వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు హాజరు.. సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొననున్న రేవంత్..
* నేడు లక్నోలో విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం.. కేంద్రమంత్రి శ్రీపాద యశోనాయక్ అధ్యక్షతన సమావేశం.. హాజరుకానున్న ఏపీ విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్..
* నేడు వంశీని కస్టడీలోకి తీసుకోనున్న ఆత్కూరు పోలీసులు.. స్థలం ఆక్రమణ బెదిరింపు కేసులో వంశీని ఒకరోజు పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు..
* నేడు ఏపీలో పెన్షన్ నగదు బ్యాంకుల్లో జమ.. ఏప్రిల్ 1న లబ్దిదారులకు అందించేందుకు వీలుగా.. ముందుగానే బ్యాంకుల్లో నగదు జమ చేయనున్న సర్కార్..
* నేడు వీఎంఆర్డీఏ బోర్డు సమావేశం.. రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న బోర్డు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ వరకు సమాంతర రహదారి..
* నేడు ఏపీలోని 35 మండలాల్లో తీవ్ర వడగాలులు.. 223 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం..
* నేడు తెలంగాణలోని 23 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం..
* నేడు తెలంగాణలో 5వ తరగతి గురుకుల ప్రవేశాల ఫలితాలు.. ఫలితాలు ప్రకటించనున్న ఎస్సీ గురుకుల సొసైటీ..
* నేటి నుంచి ఏనుమాముల మార్కెట్ కు వరుస సెలవులు.. 4 రోజులు వరుస సెలవులు ఉండడంతో విక్రయాలు బంద్.. అమావాస్య, ఉగాది, రెండు రోజులు రంజాన్ సెలవులు.. ఏప్రిల్ 2 నుంచి కొనసాగనున్న క్రయవిక్రయాలు..
* నేడు ఐపీఎల్ లో గుజరాత్ వర్సెస్ ముంబై.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకి మ్యాచ్..