విశాఖను ఆంధప్రదేశ్ ఐకానిక్ క్యాపిటల్ గా మార్చుతాం.. విశాఖ రీజియన్ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందన్నారు మంత్రి నారా లోకేష్.. ఆర్థిక వృద్ధిలో విశాఖను దేశంలోనే ఐదవ స్థానంలో నిలపాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆయన.. విశాఖను ఒక బ్రాండ్ గా మార్చుతాం.. విశాఖలో 2029లోపు 5 లక్షల ఐటీ ఉద్యోగాలను కల్పిస్తామని స్పష్టం చేశారు..
భారతీయ జనతా పార్టీలో చేరారు ఎన్నారై, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ.. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ గూటికి చేరారు.. యార్లగడ్డకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు పురంధేశ్వరి..
ఈ రోజు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు హైదరాబాద్‌కు వెళ్లారు నెల్లూరు పోలీసులు.. నిన్న సాయంత్రం నెల్లూరులోని ఇంట్లో కాకాణి లేకపోవడంతో గేట్‌కు నోటీసులు అంటించారు పోలీసులు.. ఇక, హైదరాబాద్‌లోని ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉగాది జరుపుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్టారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. దీంతో, కాకాణి.. హైదరాబాద్ లో ఉన్నారనే సమాచారంతో అక్కడికే బయల్దేరి వెళ్లారు..
High Tension In Ramagiri: అనంతపురం జిల్లాలో వైసీపీ కార్యకర్త మృతి రాజకీయ వేడిని రాజేసింది. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో జరిగిన గొడవలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లింగమయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోస్టుమార్టం నిర్వహించే ప్రభుత్వ ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Minister Uttam: నేడు కాకినాడ జిల్లాలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్ కు తెలంగాణ బియ్యం ఎగుమతి చేయనున్నారు.
Visakhapatnam: రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన మహిళతో సాన్నిహిత్యం పెంచుకున్న తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన బి అక్షయ్ కుమార్.. ఆమెతో తీసుకున్న వీడియోలను చూపించి బెదిరించి 4 కోట్ల రూపాయల నగదుతో పాటు 800 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేశాడు.
Vizag: విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మరొకరిని వివాహం చేసుకున్నాడని కోపంతో రగిలిపోయిన యువతి.. ఆ కోపంతో అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేసిన 14 వాహనాలను దగ్ధం చేసింది.
నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట హాజరుకావాలని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి పోలీసుల నోటీసులు.. కాకాణి ఇంట్లో లేకపోవడంతో గేట్ కు నోటీసులు అంటించిన పోలీసులు.. అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా కాకాణి గోవర్థన్ రెడ్డిని చేర్చిన పోలీసులు..