Home Minister Anitha: అనకాపల్లి జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రాలపై నిఘా, నియంత్రణ కొరవడింది. ఇక, కైలాసపురంలో భారీ విస్పోటం తర్వాత అధికార యంత్రాంగం కదిలింది. అయితే, జిల్లాలో సుమారు 40 వరకు బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. అందులో, కేవలం 21 తయారీ కేంద్రాల నిర్వాహకులు మాత్రమే లైసెన్స్ పొందినట్టు నిర్ధారణ చేసుకున్నారు అధికారులు. ఈ పేలుడు ఘటన తర్వాత ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బాణాసంచా తయారీ కేంద్రాల్లో సేఫ్టీ ఆడిట్ చేయించాలని పేర్కొన్నారు.
Read Also: Anna Lezhneva: అన్నదాన సత్రానికి మార్క్ శంకర్ పేరు మీద రూ. 17 లక్షల విరాళం..
ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా తయారీ కేంద్రాలులో సేఫ్టీ ఆడిట్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయం అన్నారు. ఎల్జీ పాలిమర్ ప్రమాదంలో మృతులకు కోటి రూపాయలు ప్రకటించిన గత ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం అందజేయలేదన్నారు. అలాగే, మృతుల కుటుంబాలకు 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాం.. వీలైనంత త్వరగా మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం అందజేస్తామన్నారు. వారి దహన సంస్కార ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు.