* నేడు కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సదస్సు.. భూభారతి పోర్టల్, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ.. తాగునీటి పథకాలపైనా చర్చించనున్న సీఎం రేవంత్..
* నేడు భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవం.. సాయంత్రం 5 గంటలకి ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు.. పైలట్ ప్రాజెక్టులో సలహాలు, సూచనలు స్వీకరణ.. ప్రజల సూచనల ఆధారంగా పోర్టల్ అప్డేట్..
* నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన.. తాటికొండ(మం) పొన్నెకల్లులో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం..
* నేడు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. ఉదయం 11 గంటలకి ఎస్సీ వర్గీకరణపై చర్చ.. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం.. ఇవాళ ఎస్సీ వర్గీకరణపై జీవో జారీ చేయనున్న తెలంగాణ సర్కార్..
* నేడు మంచిర్యాల జిల్లాకు ఐదుగురు మంత్రులు.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు, ఉత్తమ్, పొన్నం, సీతక్క..
* నేడు శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన.. ఉదయం అంబేడ్కర్ జంక్షన్ లో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ.. అనంతరం అంబేడ్కర్ ఆడిటోరియంలో సమావేశం.. రాగోలులో సైనిక్ భవన్ కు శంకుస్థాపన చేయనున్న అచ్చెన్న.. మధ్యాహ్నం తండేలవలసలో విద్యుత్ ప్లాంట్ ప్రారంభోత్సవం..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. నిండిపోయిన అన్ని కంపార్ట్మెంట్లు.. శ్రీవారి సర్వదర్శనానికి 18గంటల సమయం..
* నేడు ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ చైన్నె సూపర్ కింగ్స్.. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకి మ్యాచ్..