Merugu Nagarjuna: విజయవాడలోని 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ కు మాజీ మంత్రి మేరుగ నాగార్జునతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పుష్పాంజలి ఘటించారు.
Read Also:US-China Trade War: అమెరికాకు కీలక లోహాలు, అయస్కాంతాల ఎగుమతిని నిలిపేసిన చైనా..
ఇక, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం అంబేడ్కర్ ను తాకట్టు పెట్టింది అని ఆరోపించారు. లూలూ కంపెనీకి స్వరాజ్య మైదాన్ ను తాకట్టు పెట్టాలని చూసారు.. ఎందుకు అంబేడ్కర్ స్మృతి వనాన్ని పీపీపీ మోడల్ లో ప్రైవేటు పరం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఈ ప్రాంతాన్ని అమ్మడానికి చూశావో అదే నీకు మరణ శాసనం అని హెచ్చరించాడు. ఇక, చంద్రబాబు చేసే మోసం, చేసే కొనుగోళ్ళు అమ్మకాలు ప్రజలు గమనిస్తున్నారు.. ఇది పీపీపీ మోడల్ లో ప్రైవేటు పరం చేస్తామంటే.. రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకిస్తామన్నారు. దేశానికి అంబేడ్కర్ ఆలోచనలు శరణ్యం అని ఆలోచన చేసిన వ్యక్తి మాజీ సీఎం జగన్.. చదువుకు ప్రాధాన్యత ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు చదువునిచ్చారు జగన్.. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా వైఎస్ జగన్ పరిపాలన చేశారని మాజీమంత్రి నాగార్జున పేర్కొన్నారు.