TTD EO Shyamala Rao: తిరుపతి ఎస్వీ గోశాలలో ఆవుల మృతిపై టీటీడీ ఈఓ శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ కరుణాకరరెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. మూడు నెలల్లో వంద ఆవులు చనిపోయాయని తెలిపారు.. అసత్యాలు ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీసేలా వ్యవహరించారు.. సగటున నెలకు 15 ఆవులు చనిపోతాయి.. గడచిన మూడు నెలల్లో కేవలం 43 ఆవులు చనిపోయాయని ఆయన తేల్చి చెప్పారు. ఇక, దాతల నుంచి తీసుకున్న ఆవుల్లో కొన్ని అనారోగ్యంతో చనిపోయాయి.. మృతి చెందిన ఆవులకు పోస్టుమార్టం చేయ లేదనడం అవాస్తవం.. జూన్ 2024లో ఈఓగా బాధ్యతలు తీసుకొనే ముందు ముఖ్యమంత్రిని కలిశాను.. టీటీడీలో వ్యవస్థలు పాడయ్యాయి వాటిని సరి చేయాలని చెప్పారని శ్యామలరావు పేర్కొన్నారు.
Read Also: Kishan Reddy: అంబేద్కర్తో అనుబంధం, సంబంధం ఉన్న ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దారు..
ఇక, 10 నెలల్లో ఎన్నో ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా మౌలిక వసతులు మెరుగుపరిచాం.. టీటీడీ ఐటీ విభాగంలో ఉన్నతస్థాయి అధికారి నియామకంలో నిబంధన గాలికి వదిలారు.. జీఎం స్థాయి అధికారిని నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారు.. ఐటీ విభాగంలో అక్రమాలు భారీగా జరిగాయి.. ఐటీ విభాగం వైఫల్యంతో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. దళారి ఒకరు 50 సార్లు ఆర్జిత సేవలు టికెట్ పొందారు.. అలాగే, నెయ్యి కొనుగోలులో అక్రమాలు జరిగాయి.. కల్తీ నెయ్యి సరఫరాను అరికట్టాం.. అన్న ప్రసాదంలో నాణ్యత లోపించింది.. గడచిన ఐదేళ్లలో వ్యవస్థలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈవో శ్యామలరావు చెప్పుకొచ్చారు.
Read Also: YSRCP: మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయి..
అయితే, స్వామి వారికి ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో పలు అక్రమాలు చేశారని శ్యామలరావు పేర్కొన్నారు. మూడు కోట్ల రూపాయల విలువైన సరుకులకు రూ.25 కోట్లు చెల్లించారు.. టీటీడీ గోశాల నిర్వహణలో ఎన్నో అక్రమాలు జరిగాయి.. మార్చి 2021 నుంచి మార్చి 2024 వరకు గోశాలలో భారీ అక్రమాలు చోటు చేసుకొన్నాయి.. గత ఐదేళ్లలో చనిపోయిన ఆవుల వివరాలు దాచి పెట్టారు.. ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధులు దుర్వినియోగం.. 2023లో విజిలెన్స్ అధికారులను గోశాలకు అనుమతించలేదు.. గోశాలలో అక్రమాలు బయట పెడతారనే భయంతో విజిలెన్స్ అధికారులను రానివ్వలేదు అని టీటీడీ ఈవో శ్యామలరావు ఆరోపించారు.