Anna Lezhneva: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా తిరుపతిలోని టీటీడీ అన్నదానం ట్రస్ట్‌కు భారీ విరాళం ప్రకటించింది. ఆమె కుమారుడు కొణిదెల మార్క్ శంకర్ పేరుతో సుమారు 17 లక్షల రూపాయలను ఉదారంగా విరాళం అందించారు. ఈ విరాళంలో భాగంగా, మార్క్ శంకర్ పేరు మీద ఈ రోజు మధ్యాహ్నం భక్తులకు భోజన సదుపాయం ఏర్పాటు చేయించింది.
Read Also: TTD EO Shyamala Rao: గోశాలలో ఆవుల మృతి.. అసత్య ప్రచారంతో టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీయొద్దు..
అయితే, ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భార్య అన్నా లెజ్నెవా స్వయంగా శ్రీ వెంగమాంబ అన్నదాన కేంద్రంలో భక్తులకు భోజనం వడ్డించారు. ఆ తరువాత స్వయంగా ప్రసాదం స్వీకరించారు. కాగా, అన్నా లెజ్నెవా తిరుమల శ్రీవారి సందర్శించిన సమయంలో ఆమె చేసిన గొప్ప దాతృత్వంతో టీటీడీ ప్రశంసలు కురిపించింది.