Harsha Kumar: పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు వివాదంగా మారింది.. క్రైస్తవ సంఘాల ఆందోళనలతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చివరకు ప్రవీణ్ పగడాలది రోడ్డు ప్రమాదమేనని క్లారిటీ ఇచ్చారు.. దానికి సంబంధించి కొన్ని సీసీ ఫుటేజ్‌లు కూడా బయటపెడుతూ.. వివరించారు.. అయితే, ప్రవీణ్ పగడాల కేసులో సంచలన వ్యాఖ్యలు చేవారు. మాజీ ఎంపీ హర్ష కుమార్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు దర్యాప్తును నేను నమ్మడం లేదన్నారు.. రోడ్డు ప్రమాదం కాదు కచ్చితంగా హత్యే నంటూ హాట్ కామెంట్లు చేశారు.. ఆర్ఎస్ఎస్, హిందూ మతోన్మాదులు పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేశారని నా అనుమానం అన్నారు.
Read Also: Robot Dog: ఐపీఎల్‌లో రోబో డాగ్.. అక్షర్, పాండ్యాకు షేక్ హ్యాండ్! వీడియో వైరల్
ఇక, మత మార్పిడి నిషేధ చట్టానికి వ్యతిరేకంగా పాస్టర్ ప్రవీణ్.. సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు.. రేపు సుప్రీంకోర్టులో ప్రవీణ్ పగడాల తన వాదనలు వినిపించాల్సిన ఉంది.. ఇదే కేసులో బీజేపీ అధికార ప్రతినిధి అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ వాదిస్తున్నారు.. ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు, అశోక్ కుమార్ ఉపాధ్యాయ కలిసి హత్య చేయించారని నా అనుమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హర్షకుమార్.. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉండడంవల్లే ప్రవీణ్ ల్యాప్ టాప్ ను పోలీసులు తీసుకెళ్లారు.. ఆ రోజు విజయవాడ సమీపంలోని తెంపెల్లి వద్ద సువార్త సభలకు పాస్టర్ ప్రవీణ్ వెళ్లారని తెలిపారు.. సభకు వెళ్లిన సీసీ ఫుటేజ్ ను పోలీసులు ఎందుకు సంపాదించలేదు? అని నిలదీశారు.. పాస్టర్ ప్రవీణ్ ను హైదరాబాద్ శివారులోని యూపీ గ్యాంగ్ లు హత్య చేశారనే అనుమానం ఉందన్నారు.. నేను వ్యక్తం చేస్తున్న అనుమానాలకు నా వద్ద ఎలాంటి ఆధారాలు లేవు.. కానీ, నా అనుమానాలపై దర్యాప్తు చేయాల్సిన బాధ్యత పోలీసులదే అంటున్నారు హర్షకుమార్.
Read Also: Indigo Flight: 39 వేల అడుగుల ఎత్తులో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు
ఇంకా చాలా మంది పాస్టర్ లను హత్య చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి, సెక్యులర్ వాదులు అంత ఏకం కావాలి అని పిలుపునిచ్చారు హర్షకుమార్.. ఈస్టర్ పండుగ సందర్భంగా ఈ నెల 19 సాయంత్రం రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల మృతి చెందిన ప్రాంతం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పిస్తాం.. నేను న్యాయం వైపు మాట్లాడే వాడిని అన్నారు మాజీ ఎంపీ హర్ష కుమార్..