YS Jagan: శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి సమీపంలో మాజీ ముఖ్యమంత్రి, వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ విండో షీల్డ్ కు ఎయిర్ క్రాక్ ఘటనప్తె పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సంఘటనపై మరిన్నీ వివరాలు తెలియజేయాలని పైలెట్, కోపైలెట్ కు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. రేపు ( ఏప్రిల్ 16న ) విచారణకు హాజరు కావాలని చెప్పినట్లు తెలుస్తుంది. రెండు రోజుల క్రితం నోటీసులు ఇచ్చినట్లు టాక్.
Read Also: Police Harassment: సత్తెనపల్లిలో పోలీసుల వేధింపులు.. రౌడీ షీటర్ ఆత్మహత్యాయత్నం..
అయితే, రామగిరిలోని పాపిరెడ్డిపల్లిలో టీడీపీ నేతల దాడుల్లో మరణించిన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి బెంగళూరు నుంచి ప్రత్యేక హెలీకాప్టర్ లో వైఎస్ జగన్ రామగిరి వెళ్లారు. ఇక, లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత తిరుగు ప్రయాణంలో జగన్ హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో రోడ్డు మార్గంలో కారులో తిరిగి వెళ్లి పోయారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.