Vizag Steel Plant Workers Indefinite strike: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరోసారి సమ్మె సైరన్ మోగింది.. రేపటి నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నారు.. తొలగించిన ఉద్యోగులను తక్షణం విధుల్లో చేర్చుకోవాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ సమ్మెకు పిలుపునిచ్చారు కాంట్రాక్ట్ కార్మికులు.. మొత్తంగా రేపటి నుంచి సమ్మెకు వెళ్లనున్నారు 14 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు.. దీంతో, అప్రమత్తమైన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టింది.. ఈ నేపథ్యంలో రెగ్యులర్ ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది..
Read Also: Tollywood : టాలీవుడ్ లోకి బాలీవుడ్ భామలు.. సౌత్ హీరోయిన్లపై ఎఫెక్ట్..?
మరోవైపు, కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు మద్దతు పలికింది ఉక్కు పోరాట కమిటీ.. కుట్ర పూరితంగా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు జరుగుతుందని విమర్శించారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలు.. స్టీల్ ప్లాంట్ లో జరుగుతోన్న పరిణామాలపై స్పందించాలి.. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.. లేని పక్షంలో పోరాటం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించింది ఉక్కు పోరాట కమిటీ..
Read Also: Rains: రైతన్నలకు గుడ్ న్యూస్.. మాన్‌సూన్ అప్‌డేట్ వచ్చేసింది.. ఈ ఏడాది జోరుగా వానలు..
ఇక, కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ.. మీడియాతో మాట్లాడిన జేఏసీ నేతలు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారు..? అని నిలదీశారు.. స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామన్న మాటను చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిలబెట్టుకోవాలని సూచించారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని స్పష్టం చేసింది అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ.