AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది.. సంక్షేమ పథకాల అమలుపై కూడా కేబినెట్‌లో చర్చ సాగింది.. ఇక, కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.. సామాజిక న్యాయం కోసం టీడీపీ పని చేసింది.. ఇప్పుడు ఎన్డీయే కూడా కట్టుబడి ఉందన్న ఆయన.. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.. జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ జరిగింది.. ఆర్డినెన్స్ రెండురోజుల్లో వస్తుంది.. ఆ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందన్నారు.. ఇక, ఎన్డీఏ కూటమి వేట నిషేధ సమయంలో మత్స్య కారుల సాయాన్ని పది వేల నుంచి 20 వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందంటూ మత్స్యకారులకు శుభవార్త చెప్పారు మంత్రి నిమ్మల.. ఈ నెల 26వ తేదీన మత్స్యకారులకు రూ.20 వేల చొప్పు సాయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అందిస్తారని తెలిపారు..
Read Also: Kotha Prabhakar Reddy : కాంగ్రెస్‌ను మేము కూల్చబోము.. కానీ మళ్లీ అధికారంలోకి మేమే వస్తాం
ఐటీ సెక్టార్ కి భూములు ఇచ్చే విషయంలో విధానాలు సరళంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం.. రాజధాని పనులు త్వరితగతిన ప్రారంభించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.. గుంటూరులో ఈఎస్ఐ ఆసుపత్రికి భూమి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో వైసీపీ కులాలు.. మతాలు.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.. మాజీ సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో మతాల మధ్య చిచ్చు పెట్టె కార్యక్రమం జరుగుతోంది. వక్ఫ్ బిల్ పేరుతో ముస్లిం.. పాస్టర్ పేరుతో క్రైస్తవులు.. గో మరణాల పేరుతో హిందువులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాజ్యసభ లో వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి.. బయటకు వచ్చి డబుల్ స్టాండ్ రాజకీయం చేశారని దుయ్యబట్టారు. డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించిన వ్యక్తి టీటీడీపై మాట్లాడతారు… భూమన చరిత్ర ఎవరికి తెలియదు.. ఆయన నాస్తికుడు.. ఐదేళ్ల వైసీపీ పాలనలో గోవులు చనిపోవడంపై నిన్న టీటీడీ ఈవో వివరించారిన తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు..