Tenali Double Horse: తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌కు మరో గౌరవం దక్కింది. యుఆర్ఎస్ మీడియా, ఆసియావన్ మ్యాగజైన్ సమర్పణలో జరిగిన ఆసియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరం 25వ ఎడిషన్‌లో 2024–25 సంవత్సరానికి గానూ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌లలో ఒకటిగా తెనాలి డబుల్ హార్స్‌ను గుర్తించారు. ఈ అవార్డును పొందామని తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ సంతోషంగా వెల్లడించింది. ఈ అవార్డు సంస్థకు తన కస్టమర్ల, భాగస్వాముల, బృంద సభ్యుల నమ్మకం, విశ్వాసం, మద్దతుకు ప్రతిబింబంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ అవార్డు ఆసియా, అమెరికా, ఆఫ్రికా అంతటా.. ఆవిష్కరణ, ప్రభావం, వృద్ధిపరంగా మార్గదర్శకమైన అత్యుత్తమ బ్రాండ్‌లు, దార్శనిక నాయకులను గుర్తించి గౌరవిస్తోంది.

2005లో ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో ప్రారంభమైన తెనాలి డబుల్ హార్స్ సంస్థ ఒకే ఉత్పత్తి మినపప్పు (ఉరద్ గోట) విభాగంలో మార్కెట్లోకి ప్రవేశించింది. నేడు ఈ కంపనీ ఫార్చ్యూన్ 500 కంపెనీగా ఎదిగి, మినపప్పు (ఉరద్ గోట) విభాగంలో అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా మారింది. గత కొద్ది సంవత్సరాలుగా ఈ బ్రాండ్ తమ జాబితాను విస్తరించుకుంది. వీటిలో పప్పు దినుసులు అండ్ పప్పులు, తినడానికి సిద్ధంగా ఉన్న (రెడీ టు ఈట్), వండడానికి సిద్ధంగా ఉన్న (రెడీ టు కుక్), స్వీట్స్ (ఉరద్ లడ్డు, మిల్లెట్ లడ్డు), డ్రై ఫ్రూట్స్, ప్రీమియం చాక్లెట్లు, చిరు ధాన్యాలు (మిల్లెట్లు) ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సంస్థ ఉత్పత్తులు ప్రస్తుతం భారతదేశంలోని 15 రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. అంతేగాక 12 దేశాల్లో కూడా తన కార్యకలాపాలను విస్తరించింది. యుఎస్ఏ, కెనడా, గల్ఫ్ దేశాలు వంటి అంతర్జాతీయ మార్కెట్ పరిధిని పెంచుకుంటుంది. అంతేకాదు, ఈ సంస్థకు 2,200కిపైగా పంపిణీదారులు, 2.5 లక్షల రిటైల్ దుకాణాల నెట్‌వర్క్ ఉండడం వల్ల లక్షలాది మంది వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందుబాటులో ఉంది.
ఇక మరోవైపు సమాజానికి కృతజ్ఞతగా.. ఈ సంస్థ ఆరోగ్యం, విద్య, గ్రామీణ సాధికారతపై దృష్టి సారిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో CSR కార్యక్రమాలు చేపడుతోంది. ఈ సందర్భంగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ శ్యామ్ ప్రసాద్ మునగల మాట్లాడుతూ.. ఈ గుర్తింపు కేవలం సంఖ్యల గురించి కాదు. ఇది తెనాలిలోని ఒక చిన్న పట్టణం నుంచి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ సంస్థగా మేము ఎదిగిన మా ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈ అవార్డును మా బృందానికి, రైతులకు, భాగస్వాములకు, కస్టమర్లకు అంకితం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎప్పటిలాగే “తెనాలిలో తయారు చేయబడింది, ప్రపంచం కోసం తయారు చేయబడింది” అనే నినాదంతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. తెనాలి డబుల్ హార్స్ తాజా ఆవిష్కరణ “మిల్లెట్ మార్వెల్స్” కోసం www.tdhmillets.com వెబ్‌సైట్‌ను సందర్శించండి. ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా ఉచిత హోమ్ డెలివరీను కూడా అందిస్తున్నారు.