Prakasam District: కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం.. బెల్టుషాపుల విషయంలో కఠినంగా ఉంటాం.. బెల్టుషాపులు పెడితే బెల్ట్ తీస్తానంటూ స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే హెచ్చరించారు.. అయితే, ప్రకాశంజిల్లాలో బెల్టుషాపు కారణంగా టీడీపీలోని రెండు గ్రూపులు పొట్టు పొట్టుగా రాళ్లతో.. కర్రలతో దాడులు చేసుకొని తలలు పగలగొట్టుకొని రక్తపు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు..
Read Also: SIT Notice to MP Mithun Reddy: ఎంపీ మిథున్‌రెడ్డికి సిట్ నోటీసులు.. హైకోర్టులో ఊరట..!
త్రిపురాంతకం మండలం మిట్టపాలెం గ్రామంలో బెల్టుషాపు విషయంలో టీడీపీలోని రెండు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకొని పొట్టు పొట్టుగా తలలు పగిలి రక్తం కారేలా కొట్టుకున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే గ్రామంలో బెల్టుషాపులు పెట్టుకొని మద్యం అమ్ముకునే విషయంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ నేత మన్నే రవీంద్ర వర్గంపై యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి ఎరిక్షన్ బాబు వర్గం దాడి చేసి పొట్టు పొట్టుగా కొట్టారు.. ఈ దాడిలో టీడీపీ నాయకుడు డాక్టర్ మన్నే రవీంద్ర బామ్మర్ది, భార్య మాధవితోపాటు ఆరు మందికి తీవ్ర గాయాలయ్యాయి.. టీడీపీ నాయకుడు మన్నే రవీంద్ర వర్గం కూడా ప్రతి దాడి చెయ్యడంతో ఇంచార్జి ఎరిక్షన్ బాబు వర్గంలోని ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. మొత్తం 10 మంది టీడీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలు అవ్వడంతో వారిని హుటాహుటిన యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు డాక్టర్ మన్నే రవీంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు.. బెల్ట్ షాప్ కోసం టీడీపీలోని రెండు వర్గాలు దాడులు చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.. ఇరువర్గాల దాడితో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని మిట్టపాలెం గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.. విషయం తెలుసుకున్న త్రిపురాంతకం పోలీసులు గ్రామంలో ఎటువంటి ఘర్షణలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.