పవన్ కళ్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్లపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. రాజకీయాల్లో సీరియస్‌గా ఉన్నవాళ్లు ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తారని.. కానీ విశ్లేషకుడిగా పవన్ కళ్యాణ్ ఆప్షన్లు మాత్రమే చెప్పారని సజ్జల ఆరోపించారు. జనసేన తన పార్టీ అని పవన్ కళ్యాణ్ మర్చిపోయినట్లు ఉన్నారని సజ్జల చురకలు అంటించారు. బీజేపీ వస్తుందో లేదో కానీ టీడీపీతో వెళ్ళటం ఖాయమని పవన్ కళ్యాణ్ మాటలను బట్టి అర్థం అవుతోందన్నారు. చంద్రబాబు గేమ్…
ఈనెల 4వ తేదీన ఘనంగా పెళ్ళి జరిగింది.. ఆ తర్వాత 5వ తారీఖున రిసెప్షన్ జోరుగా నిర్వహించారు.. ఈ రెండు రోజులూ వరుడు చాలా సంతోషంగా కనిపించాడు. కానీ.. ఆ తర్వాతి రోజు మాత్రం తన ఇంట్లోనే విగత జీవిగా మారాడు. ఈ విషాదం ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. వైరా మండలం పుణ్యవరం గ్రామానికి చెందిన కమ్మంపాటి నరేష్ (29)కు ఈనెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా ఆర్లపాడు గ్రామానికి…
ఏపీకి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏపీ బీజేపీ కోర్ కమిటీ నేతలు సమావేశమై కీలకంగా చర్చించారు. ఈ సమావేశానికి పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటుగా పార్టీ ఎంపీలు టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్, కీలక నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, జీవీఎల్ నరసింహారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా వైసీపీ విషయంలో భవిష్యత్ కార్యాచరణపైనా చర్చ జరిగిందని…
ఏపీలో అధికార పార్టీ వైసీపీ నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఇప్పటిదాకా సాగిన ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక జగన్ చెంతకు చేరింది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుపై వైసీపీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు,…
ఏపీలో పదో తరగతి ఫలితాలలో కుట్ర జరిగిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. టెన్త్‌లో ఎక్కువ మంది పాసైతే అమ్మ ఒడితో పాటు ఇంటర్, పాలిటెక్నిక్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనే కుట్రతోనే ఎక్కువ మందిని ఫెయిల్ చేశారని మండిపడ్డారు. అయితే ఇది టెన్త్ స్టూడెంట్స్ ఫెయిల్ కాదని.. సర్కారు ఫెయిల్యూర్ అంటూ లోకేష్ విమర్శించారు. జగన్ ప్రభుత్వం తొలిసారి నిర్వహించిన టెన్త్ పరీక్షల్లో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీసుల…
ఏపీలో మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమాల మధ్య వార్ కొనసాగుతోంది. పొత్తులపై పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ తాను ట్వీట్ చేసి డిలీట్ చేశానన్న మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై దేవినేని ఉమ కౌంటర్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వమే స్వయంగా ఫేక్ ట్వీట్లను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్‌కు తెలిసే సజ్జల డైరెక్షన్లో ఫేక్ ప్రచారం జరుగుతోందని దేవినేని ఉమ ఆరోపించారు. కులాల మధ్య, పార్టీల మధ్య వైషమ్యాలు పెంచేందుకు ప్రభుత్వమే ఫేక్ ప్రచారానికి…
తమ స్థలంలో లంకె బిందెలు ఉన్నాయని.. పురావస్తుశాఖ ద్వారా తవ్వించాలంటూ ఓ మహిళ సాక్షాత్తు గ్రీవెన్స్ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్‌ను కోరిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళ్తే.. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన దిల్షాద్ బేగం అనే ముస్లిం మహిళ తన పూర్వీకుల స్థలం కారంపూడిలోని కన్యకాపరమేశ్వరి ఆలయం పక్కన గల బజారులో ఉందని.. సదరు స్థలంలో లంకెబిందెలు ఉన్నట్లు తనకు తెలిసిందని స్వయంగా పల్నాడు జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.…
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఉద్యోగుల బదిలీ ఫైలుపై ఆయన సంతకం చేశారు. ఈ క్రమంలో బదిలీల్లో ఉద్యోగుల అర్హత, ఖాళీల వివరాలు, ఇతర నిబంధనలతో రేపు లేదా ఎల్లుండి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. CM Jagan: రేపు గుంటూరు, పల్నాడు జిల్లాలలో సీఎం జగన్ టూర్ షెడ్యూల్ ఉద్యోగుల…
తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగానే కాదు విదేశాల నుంచి కూడా భారీ ఎత్తున విరాళాలు అందుతుంటాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాడు టీటీడీకి అత్యధిక మొత్తంలో విరాళాలు అందాయి. ఈ మేరకు తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు రూ.10 కోట్ల విరాళాలు అందించారు. ఈ నలుగురు భక్తుల్లో గోపాల బాలకృష్ణన్ అనే భక్తుడు ఏకంగా రూ.7 కోట్ల విరాళం అందజేశాడు. Rains In AP : ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు.. తిరునల్వేలికి చెందిన…
ఏపీ సీఎం జగన్ మంగళవారం నాడు గుంటూరు, పల్నాడు జిల్లాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు సీఎం టూర్ షెడ్యూల్‌ను ప్రకటించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ ఉ.10:40 గంటలకు గుంటూరు చుట్టుగుంట సెంటర్లోని సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. డాక్టర్ వైయస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్లను, హర్వెస్టర్లను సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు…