గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలే చంద్రబాబుకు చివరివి అని జోస్యం చెప్పారు. ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని కొడాలి నాని చెప్పారు. చంద్రబాబు మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 95 శాతం హామీలను అమలు చేసిన వ్యక్తిగా సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసలు కురిపించారు.
Read Also:CM Jagan: చిప్ వేలికి, కాళ్లకు ఉంటే సరిపోదు.. చినమెదడులో ఉండాలి
చంద్రబాబు అని 420 అని.. ఆయనకు భయపడేవాడు ఇక్కడ ఎవడూ లేడని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. సీఎం జగన్ ఏ మంచిపని చేసినా ఎల్లో మీడియా, చంద్రబాబు సహించలేరని కౌంటర్ ఇచ్చారు. వీళ్లంతా తన గడ్డంలోని వెంట్రుక కూడా పీకలేరన్నారు. భగభగమండే జగన్ మోహన్ రెడ్డిని ఈ లుచ్చాగాళ్లు ఏమీ చేయలేరన్నారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలు పదవికి విజయమ్మ రాజీనామా చేస్తే విషపు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఓ వెధవ అని తీవ్రపదజాలంతో దూషించారు. అసెంబ్లీలో జరగని దానికి చంద్రబాబు దొంగ ఏడుపు ఏడ్చాడని, చంద్రబాబు భార్యను ఎవరు కూడా ఏమీ అనలేదని కొడాలి నాని అన్నారు.