పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్త జల్లయ్య హత్యతో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఆయన కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను శనివారం పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి నర్సరావుపేటలో టీడీపీ నేతలు పర్యటించాలని తలపెట్టారు. సోమవారం నాడు వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం రావులాపురంలో టీడీపీ బీసీ నేతలు పర్యటించనున్నారు. ప్రత్యర్థుల చేతిలో హతుడైన జల్లయ్య కుటుంబాన్ని వాళ్లు పరామర్శించనున్నారు. Ganta Srinivasrao: టెన్త్ ఫలితాలు వాయిదా వేయడం…
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వాయిదా వేయడంపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. టెన్త్ ఫలితాలను నిర్ణీత సమయానికి ప్రకటించకపోవం ప్రభుత్వం చేతకానితననానికి నిదర్శనమని ఆరోపించారు. పదోతరగతి ఫలితాలకు సంబంధించి ఆలస్యం, అయోమయం, ఎందుకింత గందరగోళం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మొన్నటి వరకు పేపర్ లీక్ వార్తలు, ఇప్పుడు ఫలితాలు ప్రకటించలేని నిస్సహాయతను చూస్తుంటే ఏదో జరుగుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయని గంటా ఆరోపించారు. Andhra Pradesh: రేపు మధ్యాహ్నం…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్ పాలనలో నిత్యం హత్యలు, దాడులు, మహిళలపై మానభంగాలతో రాష్ట్రం వల్లకాడులా మారిందని విమర్శించారు. మాచర్లలో జల్లయ్య హత్య ముమ్మూటికి వైసీపీ ప్రభుత్వ హత్యే అని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా పోస్టుమార్టం చేసి తీసుకెళ్లారని.. బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా టీడీపీ నేతల్ని, బీసీ సంఘాల నేతల్ని హౌస్ అరెస్టులు చేయటం దుర్మార్గం…
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దాంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధర దాదాపు రూ.10 మేర దిగిరాగా, డీజిల్ ధర రూ.7 మేర తగ్గడంతో వాహనదారులకు ఊరట లభించింది. నగరంలో ఇంధన ధరలు వరుసగా నాలుగో రోజు నిలకడగా వుండటంతో..హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 స్థిరంగానే ఉన్నాయి. వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.35 అయింది. వరంగల్…
విజయవాడ రాజ్‌భవన్‌లో గ్రూప్-1 అభ్యర్థులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ అధికారుల వల్ల తాము భవిష్యత్ కోల్పోతున్నామని గవర్నర్ వద్ద గ్రూప్-1 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ అధికారులు మారితే ఫలితాలు ఎలా మారతాయని అభ్యర్థులు ప్రశ్నించారు. జవాబు పత్రాలు మార్చడం వెనుక కారణమేంటని.. అధికారులు మారాక ఆచరణ, నిర్వహణ తీరు మారిపోయిందని ఆరోపించారు. గతంలో 326 మందిని ఇంటర్వ్యూకి పిలిచారని.. ఇప్పుడు 202 మందిని ఆ జాబితా నుంచి…
కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్(APREI) సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరికి రివైజ్డ్ పేస్కేల్ ప్రకారం మినిమం టైమ్‌స్కేల్‌ను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీవో నెం.40 వర్తింపజేస్తూ సొసైటీ కార్యదర్శి ఆర్ నరసింహరావు మెమో జారీ చేశారు. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు…
ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రేపటి నుంచి ఈ నెల 13 వరకు హర్యానాలోని పంచకులలో ప్రారంభం కానున్నాయి. 25 క్రీడావిభాగాల్లో మొత్తం 4,700 మంది అథ్లెట్లు పోటీ పడుతుండగా.. ఇందులో 2,262 మంది బాలికలు ఉన్నారు. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, హ్యాండ్‌బాల్, రెజ్లింగ్, వాలీబాల్, బాక్సింగ్‌తో పాటు ఇతర క్రీడలను ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో నిర్వహించనున్నారు. అంబాల, షాహాబాద్, చండీగఢ్, న్యూఢిల్లీలోని మైదానాల్లో ఈ గేమ్స్ జరగనున్నాయి. COMMONWEALTH…
★ ఢిల్లీ: ఉదయం 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ ★ కాకినాడ జిల్లా: నేడు జిల్లాలో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ పర్యటన.. సాయంత్రం 4:30 గంటలకు అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని.. సా.6 గంటలకు పిఠాపురంలోని కుక్కుటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకోనున్న సునీల్ దియోధర్ ★ గుంటూరు: సోషల్ మీడియాలో పోస్టులపై అచ్చెన్నాయుడు పీఏ వెంకటేష్‌ను రెండో రోజు విచరించనున్న సీఐడీ పోలీసులు ★ బాపట్ల జిల్లా: నేడు…
* నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్. ప్రధాని నరేంద్రమోడీతో సాయంత్రం భేటీ కానున్న జగన్. * నేడు పోలవరం ప్రాజెక్టుని సందర్శించనున్న ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం అధికారులతో మంత్రి అంబటి సమీక్ష * ఇవాళ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్. హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో అవతరణ వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు. *విశాఖ ఆంధ్రాయూనివర్శిటీలో…