ఓ సీఐపై అత్యాచారం కేసు నమోదు చేశారు వనస్థలిపురం పోలీసులు. తన భర్తపై దాడి చేసి.. తనను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారేడ్‌పల్లి సీఐపై వనస్థలిపురం పీఎస్‌లో కేసు నమోదు చేశారు.. బాధిత మహిళ భర్తపై దాడికి పాల్పడిన సీఐ.. ఆ తర్వాత నగర శివారులోని ఓ లాడ్జికి బలవంతంగా ఆ మహిళను తీసుకెళ్లాడు.. ఆపై అమెపై అఘాయిత్యానికి పాల్పడినట్టు తన ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు.. ఇక, ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐగా డ్రగ్స్ కేసులో నిందితుడు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది.. సదరు సీఐపై అత్యాచారం, అత్యాయత్నం, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: Shinzo Abe: షింజో అబేను అందుకే కాల్చేశా.. విచారణలో వెల్లడించిన నిందితుడు
బాధితురాలి ఫిర్యాదుతో సదరు సీఐపై 452, 376(2), 307, 448, 365 ఐపీసీ మరియు సెక్షన్ 30 ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ 1959 కింద కేసులు నమోదు చేశారు వనస్థలిపురం పోలీసులు.. గతంలోనే బాధితురాలిపై బలవంతంగా అత్యాచారం చేసినట్టు పేర్కొంది.. నిలదీసిన భర్తను ఎలాంటి తప్పుచేయలేదని క్షమించమని కోరాడని.. ఆ తర్వాత ఎస్‌ఐ, కానిస్టేబుళ్లను ఇంటికి పంపించి.. తనను మరియు తన భర్తను టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి కొట్టి, చేతుల్లో గంజాయి ప్యాకెట్లు పెట్టి ఫొటోలు మరియు వీడియోలు తీశారని.. ఈ విషయం ఎక్కడ చెప్పినా.. గంజాయి కేసు నమోదు చేస్తానని బెదిరించాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఇక, మళ్లీ ఈ నెల 6వ తేదీన ఆమె భర్త లేని సమయంలో లైంగిక కోరికను తీర్చాలని ఆమెను వేధించాడు.. వాట్సాప్ కాల్ చేసి బూతులు మాట్లాడాడు.. 7వ తేదీన రాత్రి సమయంలో హస్తినాపురంలోని శ్రీ వెంకటరమణ కాలనీలోని బాధితురాలి నివాసంలో ఆమెను కొట్టి.. అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆ సమయంలో ఇంటికి వచ్చిన బాధితురాలి భర్తను కర్రతో కొట్టి, ఆపై రివాల్వర్ బెదిరించినట్టు చెబుతున్నారు.. ఆ తర్వాత తనను ఇంటి నుంచి తీసుకెళ్లాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో కారు ప్రమాదానికి గురైందని.. ఒకవేళ ఇన్స్పెక్టర్ కారు రోడ్డు ప్రమాదానికి గురి కాకుండా ఉండి ఉంటే తమ భార్యాభర్తల ఇద్దరిని చంపేసి ఎక్కడో పడేసేవాడు అసలు నిజాలు బయటికి వచ్చేవి కావని వాపోయారు.. సీఐపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. దీంతో కేసు నమోదు చేశారు పోలీసులు.