టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మరోసారి విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్.. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధి కార్యక్రమాలకు చూసి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఈర్ష్య, అసూయ అని మండిపడ్డారు.. చంద్రబాబు వంటి కిరాతకులు, రాక్షసులు అడ్డుపడ్డా ఇళ్ల నిర్మాణం మాత్రం ఆగలేదని స్పష్టం చేశారు. అసలు, ఒక్క లబ్ధిదారుడైనా ఇబ్బంది కలిగిందని పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు?…
ఉపాధ్యాయుల విధుల విషయంలో కీలక సవరణలు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉపాధ్యాయులకు విద్యాయేతర విధుల నుంచి పూర్తిగా మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది.. దశాబ్దాలుగా ఉపాధ్యాయులు చేస్తున్న ఎన్నికల విధులు, జన గణన వంటి విధుల నుంచి ఇక మినహాయింపు లభించనుంది.. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది.. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో మంత్రుల సంతకాలు కూడా పూర్తి చేశారు.. దీంతో, ఉపాధ్యాయుల విధుల సవరణపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడే ఎన్నికలు రావు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తాం.. అసలు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకేంటి? అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో సహా పలువురు వైసీపీ కీలక నేతలు చెబుతూ వస్తున్నారు.. ఇదే సమయంలో.. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు అనే తరహాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ప్రజల్లో ఉండేందుకే కార్యక్రమాలు తీసుకుంటున్నారు.. వరుసగా సమావేశాలు, సభలు పెడుతున్నారు.. ఈ తరుణంలో.. రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.. శ్రీకాకుళం జిల్లా తన…
ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని నియమించింది వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. రేపు సాయంత్రం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఇక, ఇప్పటి వరకు సీఎస్‌గా కొనసాగుతోన్న సమీర్ శర్మ.. రేపు బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.. ఇప్పటికే రెండుసార్లు పదవి పొడిగింపు పొందిన సమీర్ శర్మను వదులుకోవడానికి సిద్ధంగా లేరు సీఎం వైఎస్ జగన్.. దీంతో, 2023 నవంబర్ వరకు ఆయన పదవీకాలం పొడిగించాలంటూ కేంద్రాన్ని మరోసారి కోరారు..…
ఓవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ జవహర్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు.. కీలక ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేసింది.. సీఎంవో స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌గా మధుసూదన రెడ్డి, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్‌ను బదిలీ చేశారు.. ఇక, సెలవుపై వెళ్లిన బుడితి రాజశేఖర్‌ను.. సెలవు నుంచి తిరిగొచ్చిన తర్వాత జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం.. ఆర్…
AP New CS Jawahar Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది… ఈ నెల 30వ తేదీన ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ రిటైర్ కానుండగా.. ఆ వెంటనే జవహర్ రెడ్డి బాధ్యత స్వీకరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, వాస్తవానికి ఈ ఏడాది మే నెలలోనే సమీర్ శర్మ పదవీకాలం ముగిసిపోయింది.. కానీ, ప్రభుత్వం ఆయన పదవి…
వైఎస్ వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని వైఎస్ జగన్ కుటుంబం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. ఆ విషయంపై స్పందించిన ఆయన.. ఏపీలో ఫ్రీ అండ్ ఫేర్ విచారణ జరగడం లేదని వారు అంటున్నారు.. ట్రయల్ ఎక్కడ జరిగినా మాకు…
ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే.. త్వరలోనే మూడు రాజధానులపై చట్టం తీసుకొస్తామని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి… రాజధాని సంబంధించి ప్రభుత్వం, వైపీసీ స్టాండ్ కు తగ్గట్టుగానే సుప్రీంకోర్టు నిర్ణయం ఉందని భావిస్తున్నామన్న ఆయన.. మూడు రాజధానులపై పకడ్బందీగా చట్టం తీసుకువస్తామని గతంలో చట్టాన్ని వెనక్కి తీసుకున్నాం.. లేని చట్టంపై హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చిందన్నారు. రాజధానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామన్న ఆయన.. శాసన రాజధాని…
తెలంగాణలో వైఎస్ షర్మిల అరెస్ట్, ఆందోళనలపై స్పందించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయనకు.. షర్మిల్ అరెస్ట్‌పై ప్రశ్నలు ఎదురయ్యాయి.. ఆయన స్పందిస్తూ.. షర్మిల అరెస్ట్ బాధాకరం అన్నారు.. మా నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి ఆమె.. ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధకలిగించిందన్నారు.. అయితే, ఆమె పార్టీ విధానాలకు సంబంధించి మీరు ప్రశ్నించటం.. మేం మాట్లాడటం…
RK Roja: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో జగనన్న స్వర్ణోత్సవ సంస్కృతిక సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన కళలను భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకునే విధంగా నాలుగు జోన్లలో జగనన్న స్వర్ణోత్సవ సంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి, గుంటూరులో ఇప్పటికే ఉత్సవాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. గడచిన 1000 సంవత్సరాలుగా గోదావరి జిల్లాలో కళలు, సంస్కృతి విరాజల్లుతున్నాయని…