What’s Today:
* ఢిల్లీ: నేటి నుంచి జనవరి 1 వరకు సుప్రీంకోర్టుకు శీతాకాల సెలవులు
* తిరుమల: నేటి నుంచి శ్రీవారి ఆలయంలో ధనుర్మాస పూజలు ప్రారంభం.. సుప్రభాతం సేవకు బదులుగా తిరుప్పావైతో స్వామి వారికి మేల్కొలుపు.. జనవరి 14 వరకు సుప్రభాతం సేవను రద్దు చేసిన టీటీడీ
* నేడు విజయనగరం రానున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. సెంచూరియన్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న గవర్నర్
* సత్యసాయి: నేడు పెనుకొండ నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి సమావేశం.. హాజరుకానున్న పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
* విశాఖ: నేడు ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. ముఖ్య అతిథులుగా ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, ప్రముఖ వ్యాపారవేత్త జీఎంఆర్
* నేడు భట్టి విక్రమార్క నివాసంలో మరోసారి తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం.. పీసీసీ కమిటీ వివాదంపై చర్చించనున్న టీ కాంగ్రెస్ నేతలు