Vehicles Scam: బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్‌లో అవకతవకలు జరిగిన కేసులో టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాక్ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి జేసీ ప్రభాకర్‌రెడ్డి కంపెనీకి చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరుడు గోపాల్‌రెడ్డికి చెందిన రూ.22.10 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. స్క్రాప్…
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల నుంచి టీచర్లను తప్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకువస్తామని మంగళవారం ప్రకటించింది. బోధనేతర పనుల వల్ల విద్యార్థులకు పాఠాలు చెప్పడంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారని ఇటీవల ప్రభుత్వ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీచర్లను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే వచ్చే ఎన్నికల్లో టీచర్ల స్థానంలో ఎవరు విధులు నిర్వహిస్తారని అందరి మదిలో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. సుదీర్ఘకాలంగా ఎన్నికలు అంటే తొలుత…
CM Jagan: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జగనన్న విద్యా దీవెన నాలుగో విడత కింద తల్లుల ఖాతాల్లో బటన్ నొక్కిరూ.694 కోట్ల నగదును సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా ఆయనా మాట్లాడుతూ.. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే అన్నారు. పేదరికం చదవుతోనే దూరమవుతుందని.. పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువులకు దూరం కాకూడదని వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేశారని తెలిపారు. కానీ టీడీపీ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని…
TDP Vs YCP: ఏపీలో టీడీపీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాదుడే బాదుడు తరహాలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అనే పేరుతో మరో కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలను సిద్ధం చేసింది. ఈ మేరకు ఏలూరు జిల్లాలో బుధవారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు పర్యటనకు ముందే వైసీపీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఏలూరు జిల్లాలో టీడీపీ, వైసీపీల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా…
Perni Nani: బందరు పోర్టు నిర్మాణంపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. బందరు పోర్టు కృష్ణా జిల్లా వాసుల చిరకాల వాంఛ అని.. 18 ఏళ్ళ నుంచి తమ కల సాకారం కాకపోవటం జిల్లా వాసులు చేసుకున్న దురదృష్టమని పేర్ని నాని అభిప్రాయపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వల్లే పోర్ట్ నిర్మాణం ఆలస్యమైందని వివరించారు. పోర్టు నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న కాంట్రాక్టర్‌ను జగన్ రద్దు చేశారని.. న్యాయపరమైన చిక్కుల వల్ల మరో…
Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో భారీ చోరీ జరిగింది. లావేరు మండలం మురపాక పంచాయతీలోని గుంటుకుపేటలో సోమవారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో మద్యం వ్యానులో దుకాణం వద్దకు చేరుకున్న 11 మంది అక్కడ కాపలాగా ఉన్న ప్రసాద్, దుర్గారావులను సమీపంలోని నీలగిరి తోటలోకి తీసుకెళ్లి తాళ్లతో బంధించారు. అనంతరం మద్యం దుకాణంలోకి ప్రవేశించి రూ. 11.57 లక్షల విలువైన మద్యం బాటిళ్లను దుండగులు అపహరించుకుపోయారు. Read…
Jagananna Vidyadeevena: ఏపీ సీఎం జగన్ నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తన పర్యటన సందర్భంగా జగనన్న విద్యాదీవెన పథకం కింద నాలుగో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఉదయం 9 గంటలకు సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి ఉదయం 9:30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఉ.11:10 గంటలకు మదనపల్లి బీటీ కళాశాలకు…
What’s Today: • నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఎం జగన్ పర్యటన.. జగనన్న విద్యాదీవెన 4వ విడత నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేయనున్న సీఎం.. టిప్పు సుల్తాన్ మైదానంలో బహిరంగసభలో పాల్గొననున్న జగన్ • నేటి నుంచి ప.గో. జిల్లాలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన • తిరుమల: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.. ఆనంద నిలయానికి బంగారు తాపడం, వైకుంఠ ద్వారదర్శనంపై…
ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి కొత్త టీమ్‌ను ప్రకటించింది ఏఐసీసీ.. గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. అయితే, ఇవాళ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిశారు.. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్లు.. ఏపీలో పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు.. ఇక, ఈ సమావేశం ముగిసిన తర్వాత.. మీడియాతో మాట్లాడిన గిడుగు రుద్రరాజు.. మాది యంగ్ టీమ్.. పార్టీ బలోపేతం…
ఏపీకి కొత్త సీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది… ఈ నెల 30వ తేదీన ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ రిటైర్ కానుండగా.. అదే రోజు అంటే రేపు సాయంత్రం జవహర్ రెడ్డి బాధ్యత స్వీకరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, వాస్తవానికి ఈ ఏడాది మే నెలలోనే సమీర్ శర్మ పదవీకాలం ముగిసిపోయింది.. కానీ, ప్రభుత్వం ఆయన…