మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుకకు ఐటీ శాఖ నోటీసులు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అయితే, మంత్రి గుమ్మనూరు జయరాం.. తన భార్యకు ఐటీ నోటీసులపై స్పందించారు.. నా భార్య కు ఎలాంటి ఐటీ అధికారులు నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.. నోటీసులు ఇచ్చారని అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు.. మాది ఉమ్మడి కుటుంబం.. నాభార్య పై భూమి కొంటే బినామీ ఎలావుతుంది? అని నిలదీశారు.. నేను న్యాయ బద్ధంగా భూమి కొనుగోలు చేశానన్న…
ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా జరిమానా విధించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్‌ను సవరించింది.. కాలుష్యాన్ని సృష్టించే వారే ఈ వ్యయాన్ని భరించాలన్న థియరీ ఆధారంగా పెనాల్టీలు వేసేందుకు నిర్ణయం ఈసుకుంది.. ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు విధించనున్నట్టు పేర్కొంది.. పాలిథీన్ క్యారీబ్యాగులు ఉత్పత్తి, విక్రయాలపైనా, ఈ కామర్సు కంపెనీల పైనా దృష్టి పెట్టాలని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. మున్సిపల్…
బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. డిసెంబర్ 8వ తేదీన చేపట్టాలనుకున్న బీసీల ఆత్మీయ సదస్సు ఒక రోజు ముందే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. డిసెంబర్ 7వ తేదీన భారీ ఎత్తున బీసీ సదస్సు ఉంటుంది.. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సమావేశం జరగనుండగా.. 60 వేల నుంచి 75 వేల వరకు బీసీ నేతలు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు.. గ్రామ పంచాయతీ సభ్యుల నుంచి మంత్రుల వరకు హాజరుకానున్న ప్రజా ప్రతినిధులు.. నామినేటెడ్…
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజులు పాటు భక్తులకీ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.. సర్వదర్శనం టోకెన్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను భక్తులకు ముందుగానే జారీ చేస్తామని.. సర్వదర్శనం భక్తులకు ఆఫ్ లైన్ విధానంలో ప్రతి నిత్యం 50 వేల టికెట్లు.. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ప్రతి నిత్యం 25 వేలు ఆన్లైన్ కేటాయిస్తామన్నారు. అయితే, వైకుంఠ ద్వారాలు తెరిచే పది రోజులు పాటు టికెట్లు కలిగిన భక్తులకు…
విద్యార్థులు బుద్దిగా స్కూల్‌కు వెళ్లాలి.. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు వినాలి, చదువుకోవాలి.. క్లాస్ వర్క్‌లు, హోం వర్క్‌లతో బిజీగా ఉండాలి.. సమయం దొరికితే సరదా ఆటలు, పాటల్లో మునిగి తేలాలి.. కానీ, స్కూల్ ఏజ్‌లోనే రోడ్డుపై రౌడీల వలే గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటే ఏంటి? పరిస్థితి.. ఇదే ఇప్పుడు విశాఖపట్నంలో జరిగింది.. గుంపుగా రోడ్డుపైకి చేరుకున్న విద్యార్థుల మధ్య.. అసలు గొడవ ఎందుకు మొదలైందో తెలియదు.. కానీ, గ్రూపులుగా విడిపోయి.. తన్నుకున్నారు.. పిడిగుద్దుల వర్షం కురిపించారు.. విశాఖలో…
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.. తిరుమలలో ఇవాళ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో.. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు నిర్వహించాలని నిర్ణయించినట్టు.. ఆ సమావేశం ముగిసిన తర్వాత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.. ఇక, పిభ్రవరి 23వ తేదీన బాలాలయ పనులు ప్రారంభిస్తాం.. 6 నెలల కాల పరిధిలో బంగారు తాపడం పనులు పూర్తి చేస్తామన్నారు.. బంగారు తాపడం పనులు నిర్వహిస్తున్న సమయంలో దర్శన విధానంలో…
మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అన్నమయ్య జిల్లా పర్యటనలో ఓ బాలుడి పరిస్థితి చూసి చలించిపోయారు.. 4వ దశ జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా.. మొహ్మద్ అలీ అనే బాలుడు దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతున్న విషయం తన దృష్టికి రావడంతో.. దయార్థ హృదయాన్ని చూపారు సీఎం.. వెంటనే బాధిత బాలుడి తల్లికి ఆర్థికంగా సాయం చేయాలని, నెలవారి పెన్షన్ వచ్చేలా చూడాలని.. ఆ చిన్నారికి మెరుగైన…
ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఓవైపు మంత్రులు, వైసీపీ నేతలు.. మరోవైపు విపక్షాలకు చెందిన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి జోగి రమేష్.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొవడానికి చంద్రబాబుకి దమ్ములేదన్నారు.. ఇక, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు 86 నియోజకవర్గాల్లో అసలు తెలుగుదేశం…
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటెలిజెన్స్ వర్సెస్ పోలీసుగా మారిపోయిందట పరిస్థితి.. జిల్లా ఎస్పీలకు కొన్ని విషయాల్లో నేరుగా ఇంటెలిజెన్స్ డీజీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయట.. అయితే, ఈ వ్యవహారం పోలీస్ బాస్‌కు రుచించడంలేదు.. జిల్లా ఎస్పీలకు ఇంటెలిజెన్స్ డీజీ నేరుగా ఆదేశాలు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి… ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోవటం సరికాదని పేర్కొంటూ మెమో జారీ చేశారు. జిల్లా ఎస్పీలకు నేరుగా ఆదేశాలు జారీ చేసిన ఇంటెలిజెన్స్…
ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. రాజకీయ పార్టీలు అన్నీ దూకుడు చూపిస్తున్నాయి.. పొత్తులపై ఎవరి ప్రయత్నాలు, ఎవరి ఆశలు వారికి ఉన్నాయి.. ఈ సమయంలో.. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తనకు ఎవరితోనూ పొత్తులేదని.. తనకు కేవలం జనంతో మాత్రమే పొత్తు అని చెప్పారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటించిన సీఎంకు.. ఘన స్వాగతం…