Andhra Pradesh: 2034లో చనిపోతా.. మరణ వేడుకలకు రావాలని మాజీ మంత్రి ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Death Celebrations Invitation: సాధారణంగా ఎవరైనా పెళ్లికి లేదా గృహ ప్రవేశానికి లేదా పుట్టినరోజు వేడుకలకు శుభలేఖలు ముద్రించి బంధుమిత్రులకు పంపిణీ చేస్తుంటారు. కానీ ఎవరైనా మరణాన్ని ముందుగా అంచనా వేసి వేడుకలకు రావాలంటూ ఆహ్వానం పంపించడం చూశారా. కానీ ఏపీలోని ఓ మాజీ మంత్రి మాత్రం తన మరణవేడుకలకు రావాలని ఆహ్వాన పత్రికలను పంచుతున్నారు. తన మరణదిన వేడుకలను ఘనంగా చేసుకుంటున్నానని, అందరూ తప్పకుండా రావాలని ఆహ్వాన పత్రిక ఇస్తుంటే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మాజీ మంత్రి పాలేటి రామారావు తన మరణ వేడుకలపై ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు చీరాల ఐఎంఏ హాలులో శనివారం ఉదయం 10 గంటలకు జరిగే వేడుకలకు హాజరవ్వాలని అభిమానులను కోరారు. ‘ఏటా జరుపుకునే పుట్టినరోజు వేడుకలు అర్థరహితమని తెలుసుకున్నా.. అందుకే ఇకపై మరణదిన వేడుకలు జరుపుకోవాలని భావిస్తున్నా. ఇన్నాళ్ల నా జీవితాన్ని పరిశీలించుకున్నాక నా మరణ సంవత్సరాన్ని 2034గా నిర్ణయించుకున్నా. దానికి ఇంకా 12 సంవత్సరాలు ఉంది. ఇప్పటి నుంచి ప్రతీ సంవత్సరం మరణదిన వేడుకలు జరుపుకుంటాను. ఆ వేడుకలకు మీరు హాజరై, నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’ అంటూ రామారావు ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఏపీ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
Also Read
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
Read Also: CNG Price: మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధర.. అదనపు బాదుడు షురూ
పుట్టిన ప్రతీ ఒక్కరికీ మరణం తప్పదని, బతికి ఉన్నంత కాలం ఇతరులకు వీలైనంత సాయం చేయాలే తప్ప అపకారం చేయొద్దని రామారావు చెప్పారు. ఈ విషయం గుర్తెరిగి తాను ఎంతకాలం జీవించాలని అనుకుంటున్నాడో ఆలోచించి, మరణానికి ఓ తేదీని నిర్ణయించుకుని ఏటా మరణదిన వేడుకలు జరుపుకోవాలని సూచించారు. భగవంతుడు ఎంత బోధించినా మనిషి తన జీవన విధానాన్ని, ఆలోచనను పూర్తిగా సరిచేసుకోవడంలేదని అన్నారు.
తాజావార్తలు
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!