Ambati Rambabu: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఒకరిమీద ఒకరు మాటల యుద్దాన్ని మొదలుపెట్టారు. ముఖ్యంగా వైసీపీ నేతలు జనసేన మీద .. పవన్ కళ్యాణ్.. వైసీపీ మీద విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇంకోపక్క జనసేనానిపై నీటిపారుదల శాఖమంత్రి అంబటి రాంబాబు నిత్యం విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు.
అసలు పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.. ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి ఎలా అవుతారంటూ ఎద్దేవా చేశారు.. ఇక, పవన్ కల్యాణ్ ఈ సారి ఎన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తాడో ముందుగా చెప్పాలని సెటైర్లు వేశారు.