Minister Taneti vanitha: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయన్నది నిజమేనా? పవన్ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అయితే, పవన్‌కు వచ్చిన సమాచారం బటయపెట్టాలని డిమాండ్ చేశారు మంత్రి తానేటి వనిత.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, మేయర్ భాగ్యలక్ష్మి, కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి తానేటి వనిత.. కరోనా కష్టకాలంలో సేవలందించింది వాలంటీర్లే అన్నారు.. కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చిన మాట నిజమే అయితే.. ఆ సమాచారాన్ని పవన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జగనన్న ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్ధ ద్వారా ప్రతీదీ అమలు చేస్తున్నాం.. సురక్ష ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం.. జిల్లాస్థాయిలో ఒక టీమ్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలపై ఆరా తీస్తున్నామని వెల్లడించారు. సమస్యలు పరిష్కరించినా మిగిలిపోయి ఉంటే సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. ఇక, విజయవాడ పశ్చిమంలో స్ధిర నివాసాలు ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తున్నాం అన్నారు. త్రాగునీరు, కరెంటు కష్టాలు ఉన్నాయని తెలిసిన చోట వెంటనే సమస్య తీరుస్తున్నాం అని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి తానేటి వనిత.
Read Also: Kavya Kalyanram: బాడీ షేమింగ్ రూమర్స్ .. ‘బలగం’ బ్యూటీ క్లారిటీ