పవన్ కల్యాణ్ బస్సు యాత్ర కులం అంశంపై నే చేస్తున్నారని స్పష్టం అవుతుందని ఆరోపించారు సజ్జల.. ముద్రగడ పద్మనాభం తన కులం కోసం గట్టిగా నిలబడిన వ్యక్తి.. ఆ కృషిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదన్న ఆయన.. ముద్రగడ నిజాయితీ గల వ్యక్తి.. మా పార్టీ విధానాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం అన్నారు.
కసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అచ్యుతాపురం వస్తే ఎకరా రేటు ఎంత ఉందో తెలుస్తుందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్... ఏపీలో భూముల విలువలు తగ్గాయని చంద్రబాబు, కేసీఆర్కు చెప్పరంటా అని ఎద్దేవా చేసిన ఆయన.. ఒకసారి అచ్యుతాపురం కేసీఆర్ వస్తే ఎకరా రేటు ఎంత ఉందో తెలుస్తుందని సూచించారు