ఈరోజు ఉదయం 11 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కావాల్సింది ఉంది.. కానీ, ఉదయం జరగాల్సిన ఆ సమావేశం ఉన్నట్టుండి సాయంత్రానికి వాయిదా వేశారు.. సాయంత్రం 4 గంటలకు భీమవరంలో జనసేన నేతల మీటింగ్ ఉంటుందని తాజాగా ప్రకటించాయి జనసేన పార్టీ శ్రేణులు. అయితే, దీనికి ప్రధాన కారణం జనసేనాని పవన్ కల్యాణ్‌కు స్వల్ప అస్వస్థతకు గురికావడమే కారణంగా తెలుస్తోంది
గోల్డ్ మైనింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఎన్ఎండీసీ వర్గాలు చెబుతన్నాయి.. ప్రాంతీయ చట్టాల ప్రకారం ఈ బ్లాక్ కోసం మైనింగ్ లీజుకు తీసుకున్న మూడేళ్ల లోపు గని పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. 1.83 మిలియన్ టన్నుల బంగారం నిల్వలు కలిగిన ఈ బ్లాక్‌లో టన్నుకు 5.15 గ్రాములు మాత్రమే బంగారం రానున్నదని అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త చెప్పారు.. ఈ నెల 28న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్న ఆయన అమ్మ ఒడి పథకం నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.