Balanagi Reddy: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పటి నుంచో ఆరోపణలు గుప్పిస్తేనే ఉన్నారు.. తాజాగా వాలంటీర్ల వ్యహారం హాట్ టాపిక్ కాగా.. అంతకు ముందు నుంచే ప్యాకేజీ స్టార్ అంటూ.. దత్తపుత్రుడు అంటూ విమర్శలు చేస్తున్నారు.. ఈ వ్యహారంలో ఈ రోజు సంచలన ఆరోపణలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి.. పవన్ రూ. 300 కోట్ల ప్యాకేజ్ ఇస్తే.. జై చంద్రబాబు అంటాడు అంటూ విమర్శలు గుప్పించారు. దమ్ము, ధైర్యం ఉంటే సింగిల్‌గా పోటీ చేయి, ప్రజల తీర్పు చూద్దాం అంటూ సవాల్ చేశారు. వాలంటీర్లు, మహిళలపై పవన్ కల్యాణ్ విమర్శలు మంచిది కాదు.. మాట్లాడే పద్ధతులు నేర్చుకో అంటూ హితవుపలికారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి..
Read Also: Venugopala Krishna: ఇది ఐబీ డైరెక్టర్ సీరియస్‌గా తీసుకోవాలి.. నిఘా వర్గాల నివేదిక పవన్‌కు ఎలా..?
ఇక, పవన్ కల్యాణ్ కరోనా వచ్చినప్పుడు ఇంట్లో దాక్కున్నాడు అంటూ విమర్శలు గుప్పించారు బాలనాగిరెడ్డి.. కరోనా వచ్చినా ప్రాణాలు లెక్కచేయకుండా వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది పనిచేశారని గుర్తుచేశారు. చంద్రబాబు గురించి మాట్లాడితే పడే వర్షాలు కూడ పడవు అంటూ ఎద్దేవా చేశారు. నారా లోకేష్ మా జిల్లాలో కాలు పెట్టి నందుకు వర్షాలు వెనక్కి వెళ్లాయని సెటైర్లు వేశారు. చంద్రబాబు కంటే నారా లోకేష్ పెద్ద ఐరన్ లెగ్ అంటూ మండిపడ్డారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. కాగా, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఏపీలో వాలంటీర్లు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు.. నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పవన్ దిష్టిబొమ్మలను సైతం దగ్ధం చేస్తున్నారు. మరోవైపు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు.. సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన విషయం విదితమే.