Pawan Kalyan: సీఎం వైఎస్ జగన్‌ను మరోసారి టార్గెట్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో జరిగిన వారాహి బహిరంగసభలో.. జగన్ గారు నమస్కారం అండి.. నేను జనసేన అధ్యక్షుడిని పవన్ కల్యాణ్.. తాడేపల్లిగూడెం నుంచి మాట్లాడుతున్న అండి అంటూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. జగన్‌ను ఏకవచనంతో పిలుస్తానంటూ ఈ మధ్య ఆయన అలాగే సంభోదిస్తుండగా.. వైసీపీ నుంచి దీనిపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. దీంతో.. జగన్ గారు అంటూ ప్రారంభించి.. జగన్ అని పిలిచారు.. నేను, రాజకీయాల్లోకి మార్పు కోసం వచ్చా. . ఒక పార్టీ నడపడం ఎంత కష్టమో ఒక ఇల్లాలు అర్థం చేసుకోగలదు.. నాకు చాలా చనువు ఉంటే తప్ప ఏక వచనంతో పిలవను అన్నారు. సీఎం ప్రమాణ స్వీకారంకి పిలిస్తే రాలేను అని చెప్పాను.. మనస్పూర్తిగా అభినందనలు చెప్పాను.. ఆయన ఏక వచనంతో పిలిచినా నేను గౌరవించా అన్నారు.
ఇక, సీఎం జగన్‌ను ఏకవచనంతో పిలవడానికి కారణం ఆయనకి ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోలేదు గనేకే అన్నారు పవన్.. మీరు మా కుటుంబాన్ని, జనసేన వీర మహిళలను కించ పరిచినా ఏం మాట్లాడ లేదు.. పెళ్లాం, పెళ్లాం అని మాట్లాడతావ్ ఏంటి జగన్? ఇలాంటివి భరించాల్సి వస్తుంది అని చెప్పా.. చిన్న పిల్లల కార్యక్రమంలో భార్య గురించి మాట్లాడే అంత సంస్కార హీనులా మీరు? అంటూ ప్రశ్నించారు. వాలంటీర్స్ అంత నాసోదర సమానులు.. మీకు 5వేలు వస్తే మరో ఐదు వేలు వేసి ఇచ్చే మనస్తత్వం నాది అన్నారు పవన్.. కానీ, వాలంటీర్స్ వ్యవస్థ అవసరమా అనే నేను ప్రశ్నించేది.. అన్నారు. వాలంటీర్స్ అంటే ఏ మాత్రం డబ్బు ఆశించకుండా పని చేసే వారు.. రెడ్ క్రాస్ వాలంటీర్స్ కు అధిపతులు ఉన్నారు.. మీ వాలంటీర్ వ్యవస్థ కు అధిపతి ఎవరు.? అని నిలదీశారు. మరోవైపు.. వాలంటీర్స్ ఇచ్చే సమాచారం హైదరాబాద్ లో ఎందుకు పెట్టారు.? వాలంటీర్స్ వ్యవస్థ ఉపయోగించే విధానం పైన మాట్లాడుతున్నాం.. వాలంటీర్స్ చేసిన అఘాయిత్యాలకు ఎవరు బాధ్యత వహిస్తున్నారు.. వాలంటీర్స్ ఎర్ర చందనం తరలింపు లో పట్టుబడ్డారు.. చిన్నారుల పై అఘాయిత్యాలు చేస్తున్న వారికి కాళ్ళు కడిగి దైవాంశ సంభూతులు అంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా కమిషన్ వినాలి.. వాలంటీర్స్ రెక్కీ నిర్వహించి అఘాయిత్యాలు చేస్తున్నారు.. లొంగకపోతే పథకాలు ఆపేస్తాం అంటున్నారు అంటూ ఆరోపించారు పవన్.. వాలంటీర్స్ ఇబ్బంది పెడితే పోలీసులను ఆశ్రయించండి.. జనసేన బాధితులకు అండగా ఉంటుందని ప్రకటించారు. జగన్ జైలుకు వెళ్లారు కాబట్టి మేం వెళ్లి రాజకీయ నాయకులం అవుతాం అన్నట్టుగా కొందరు వాలంటీర్స్ పరిస్థితి ఉందన్న ఆయన.. వాలంటీర్స్ జీతం భూంభూమ్ బీరుకి తక్కువ.. ఆంధ్ర గోల్డ్ విస్కీ కి ఎక్కువ అంటూ సెటైర్లు వేశారు. ఇది కాదు నేను కలలు కనే యువత అన్నారు. జనవాణి కార్యక్రమం పెట్టడానికి కారణం వైసీపీ మహిళా వాలంటీర్ అన్నారు పవన్.. తన ఇల్లు కబ్జా చేశారన్న విషయం నాకు చెప్పిందని వాళ్ల అన్నయని చంపి ఇంటికి పంపించారని సంచలన ఆరోపణలు చేశారు. మద్యపాన నిషేదం అని చెప్పి లక్ష కోట్లు సంపాదించారని విమర్శించారు. తండ్రి బిడ్డ అని యువత అంతా నమ్మి జగన్ కు ఓట్లు వేస్తే.. లక్ష కోట్లు వేసేశారు.. తండ్రి చనిపోయాడని అంతా నిన్ను ముఖ్య మంత్రి ని చేస్తే వాళ్ల జీవితాలు దుర్బరం చేశారంటూ మండిపడ్డారు. సంపూర్ణ మద్యపాన నిషేదం సాధ్యం కాదు.. మహిళలు కోరుకున్న చోట మద్యం అమ్మకాలు జరగవు అన్నారు. ఇక, జగన్ మద్దతు దారులు అయోగ్యుడు అనే పుస్తకం రాస్తే నేను ముందుమాట రాస్తా నంటూ ప్రకటించారు. క్లాస్ వార్ అని మాట్లాడే జగన్ 1569 కోట్లు కార్మిక సంక్షేమ నిధి దోచేశారని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.