CI Anju Yadav: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇందులోభాగంగా పట్టణంలోని పెళ్లిమండం దగ్గర సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. దిష్టిబొమ్మ దహనానికి అంగీకరించబోమని మహిళా సీఐ అంజు యాదవ్ తేల్చిచెప్పారు. అయినా దిష్టిబొమ్మ కాల్చేందుకు యత్నించడంతో పలువురు నాయకుల్ని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆ తర్వాత జనసేన నాయకులు పోలీసుల కళ్లగప్పి కూడలి దగ్గరకు చేరుకున్నారు. ఈ క్రమంలో జనసేన నేతలపై సీఐ అంజు యాదవ్ చేయిచేసుకున్నారు. చిత్తూరు జిల్లా కార్యదర్శి సాయి రెండుచెంపలను చెళ్లుమనించారు సీఐ.
Read Also: Official: RC16కి రెహమాన్ మ్యూజిక్.. వేరే లెవల్ అంతే!
సీఐ అంజుయాదవ్ దురుసు ప్రవర్తన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీఐ ప్రవర్తనపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రశాంతంగా నిరసన తెలుతున్న జనసేన నాయకుడిపై అమానుషంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని జనసేన డిమాండ్ చేసింది. సీఐ అంజుయాదవ్ గతంలో చాలాసార్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. శ్రీకాలహస్తి ఆలయంలో పలువురిపైనా దాడి చేశారు. రేణిగుంటలో వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ కుమార్తెతో రోడ్డుపై వాగ్వాదానికి దిగారు. అంతేకాదు టీడీపీ మహిళా నేతతో దురుసుగా ప్రవర్తించారు. గతంలో హోటల్ నిర్వహకురాలు ధనలక్ష్మి పట్ట సీఐ అంజుయాదవ్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఈ విషయంలో జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాసింది. ఇప్పుడు జనసేన నాయకుడ్ని కొట్టడంతో సీఐ అంజుయాదవ్ తీరు మరోసారి చర్చనీయాంశమైంది.