Pawan Kalyan: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కిస్తున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్, సీఎం జగన్ మధ్య మాటల యుద్ధం మరింత ఘాటుగా మారుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక పవన్ వారాహి విజయ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. రెండు రోజుల క్రితమే ఆయన అస్వస్థతకు గురయిన విషయం తెల్సిందే.
వారిలా ఊగుతూ మనం మాట్లాడలేం.. వారిలా మనం రౌడీల్లా మీసాలు మెలేయలేం.. వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం.. బూతులు మాట్లాడలేం.. వారిలా నాలుగేసి పెళ్లిళ్లు చేసుకోలేం.. నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చలేం.. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థలను నాశనం చేయలేం.. రోడ్డుపైకి తీసుకురాలేం.. వారిలా అలాంటి పనులు మనం చేయలేం.. అవన్నీ వారికే పేటెంట్ అంటూ హాట్ కామెంట్లు చేశారు సీఎం వైఎస్ జగన్.
బడికి పిల్లలను పంపించేందుకు ఆ తల్లులకు ఇచ్చే ప్రోత్సాహకం ఇది... దేశంలో మరెక్కడా జరగటం లేదు... ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతోంది అన్నారు సీఎం జగన్.. నాలుగేళ్లలో రాష్ట్రంలో మరెప్పుడూ చూడని విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని వెల్లడించారు.. ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి మన పిల్లలు రావాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఇందులో భాగంగా పదిరోజులపాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి నిర్వహిస్తాం అని తెలిపారు
భీమవరంలోని ఓటర్లు ఎంత మంది ఉంటారు, ఎన్నిక విధానం లాంటివి కూడా పవన్ కల్యాణ్‌కు తెలియదని విమర్శించారు.. ఇక, సినిమా వాళ్లకి ప్రజల్లో ఆదరణ ఉంటుంది.. యాంకర్ అనసూయ రాజమండ్రి వచ్చినా జనం కిక్కిరిసిపోతారంటూ కామెంట్ చేశారు.